*
- ✍ తాయి నీలాంబికాదేవి
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి
చూడు చూడు చూడు చూడు చూడు లింగమా
ధ్వని దరువు : వచన ప్రసాద
చూడు చూడు చూడు చూడు చూడు లింగమా
చూడు బసవన్న గారు నడపినాటను ||ప||
హరళయ్య, మధువయ్య వారిని కట్టిలాగి
నీచులకు జ్ఞానమును కలిగించి రంట
ఉండరాదచట యిప్టు శరణులుందురని
వెదకి బసవరాజు చెప్పెనంట ||1||
నుడివి లాలించు వేగ చెడునీ కల్యాణము
ఒడయుడు సంగమునితో కలిసెనంట !
తడవు చేయకుడని మడతికి తెల్పుడని
యొడయడు బసవరాజు నుడివెనంట ||2||
అచటికి నన్ను రమ్మని చెప్పిరంట
అక్కడుండు సంగయ్య యిచట లేదే ?
అటనిటను ఉభయ సందేహమిది
తెలిసిన మహాత్ములకిది తరమె ? ||3||
అప్పఅన్నయ్యలు పిలువగనే వచ్చిరి
సన్యాసి సంగమనాథ వినుమా !
పూవుకు పరిమళము కలిసినట్లు నన్ను
గౌగలించిన లింగమా మాటలాడు ||4||
సంగన బసవని రూపము ధరించి
విడువక కరమెత్తి నమించుతు
సంగన బసవయ్య యాతడే ఈతడు
సంగయ్య లింగమా మాటలాడు ||5||
*