నాడు మాతకు నుడి నైవేద్యము
|
|
*
- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి
ఓ! తల్లి భారతి ! ప్రసరించు నీకరుణ ప్రజ్వలించు దేశభక్తిని
ఓ! తల్లి భారతి ! ప్రసరించు నీకరుణ ప్రజ్వలించు దేశభక్తిని
శౌర్య వీర్యకార్య క్షమతనింపి మాయెదకు ||ప||
హృదయ గుడి పీఠమందు నెలగొనుము శ్రద్ధతో
నాడుకొఱకు పాటుపడు ప్రాణత్యాగ భావమును నింపుచు
జాతిమత పంతముల హీనభావాల తుడుపుతూ
భిన్న భేదాల మఱచి బ్రతుకు ప్రేమభావము పెంచుతూ || 1 ||
నీనేల అన్నముతిని యొడితొడలపై యాడి పెరిగి
ద్రోహమును తలపెట్టని దేశనిష్ఠను నేర్పుతూ
నా బ్రదుకు కణకణాలు నీపాదార్పణంబు
నా చెన్న తనుమనములు నాడుగుడికర్పణంబు || 2 ||
కర్మదీక్షనొసగు తల్లి సత్యకవచమును తొడిగించు నీవు
ధర్మవంతులై బ్రదుకుకు ప్రీతి పంచము కరుణించు
శాంతి స్నేహప్రేమ సమతదేహ దారఢ్య బ్రదుకు నొసగు
నీ కీర్తి ప్రమిద వెలుగుటకు బ్రతుకు తైలము పోయుదము || 3 ||
*