అడుగడుగు స్ధాననిధి; అడుగడుగు దివ్యక్షేత్రము
|
|
*
-మడపతీ.V. V, జహీరాబాద్.
ధర్మగురు బసవేశ్వరుని వచనము
"అడుగడుగు స్ధాననిధి; అడుగడుగు దివ్యక్షేత్రము ;
అడుగడుగు నిధి విధానము కదరా !
అతని నెలవే వారణాసి అవిముక్త క్షేత్రము.
మీ శరణుడు స్వతంత్రుడయ్యా కూడలసంగమదేవా." - వచన సంపుటం : 1వచనము సంఖ్య : 854
వచనానుభావము: పై వచనములో ధర్మగురు బసవణ్ణ గారు, శరణుడి గురించి, ఆయన ఉనికిని గురించి మరియూ ఆయనలోని వైశిష్ట్యాన్ని గురించి చాలా చక్కగా వివరించారు.
స్వచ్ఛమైన మనస్సు, అందరితో వినయంగాను, విధేయులుగా ఉంటూ, దేహమే దేవాలయంగానూ, కాయమునే కైలాసంగా, మార్చుకుని సత్య శుధ్ధమైన కాయకము చేసి, సంపాదించిన దానిలో జంగమ స్వరూపమైన జ్ఞానయుక్త సమాజానికి, అవసరం ఉన్న వారికి దాసోహభావంతో అర్పించి, అందరికీ ప్రేమతో, పరమపవిత్రుడై మెలిగే శరణుడు ఎక్కడికి వెళ్ళినా.. ఆయన ఎక్కడ కాలిడినా.. ఆ స్థలం స్థాన నిధిగా మారుతుంది. శరణుడు నడిచిన చోటే పరమ పవిత్రమైన దివ్య క్షేత్రమంగా వెలుగొందుతుంది. ఆయన నొటినుండి పలికే ప్రతీ మాటా తత్వములా వెదజిల్లుతుంది. మనకు శరణుల జీవితము నిధి నిధానములాంటివి చూడుమా అని అంటారు బసవణ్ణ గారు. అటువంటి శరణుడు చిన్న గుడిసెలో నివసించినా అది వారణాసి మరియూ అవిముక్త క్షేత్రముతో సమానమని, నిరాడంబరంగా జీవించే శరణుడు నిజమైన స్వతంత్రుడు చూడుమా కూడలసంగమదేవా !
బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి.
*