Previous అడుగడుగు దివ్యక్షేత్రము ఊరిలోనికి క్రొత్త వాళ్ళు వస్తే Next

సంసారమనే అడవిలో

*

-మడపతీ.V. V, జహీరాబాద్.

ధర్మగురు బసవేశ్వరుని వచనము

"సంసారమనే అడవిలో పులి ఉండొచ్చు
ఎలుగు బంటుండొచ్చు.
శరణుడదరడు బెదరడు
మహాధీరుడు శరణుడదరడు
బెదరడు కూడలసంగని శరణుని నిర్ణయం." - సమగ్ర వచన సంపుటం : 1వచనము సంఖ్య : 1088

వచనానుభావం: సంసారము ఒక భవఘోరారణ్యం లాంటిది. అరణ్యములో భయంకరమైన రాగద్వేషాలతో కూడిన పులులూ, సింహాలు, ఘడ్గమృగాలు, తోడేలులు, ఎలుగుబంట్లు మనల్ని కీడు చేసే ఎన్నో రకాల క్రూరమృగాలు ఉంటాయి. వాటన్నింటిని భయపడేవాడు శరణుడు కాదు. ఆయడ ధృఢసంకల్ప శక్తియే ఆయనను భవఘోరారణ్యం నుండి విముక్తి చెయ్యడం జరుగుతుందని బసవేశ్వరుడు పై వచనములో చెప్పడం జరిగింది.

పంచభూతాలైన గాలి, అగ్ని, నీరు, భూమి, మరియూ ఆకాశంముతో ఏర్పడిన ఈ దేహమనే సంసారసాగరములో పంచ జ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవి, జిహ్వ మరియూ చర్మం వీటితో ఏర్పడిన ఈ దేహములో కామము, క్రోధము, లోభము, మోహము, మదము మరియూ మాత్సర్యము అనే అరిషడ్వర్గాలనే అడవి మృగాలకు శరణుడు భయపడే వాడు కాదు. ఒక్క సారి తనను తాను నిర్ణయించుకున్నాడంటే అరిషడ్వర్గాలనే కాకుండా ఎవ్వరికీ భయపడకుండా తాను చేపట్టిన లక్షాన్ని సాధించుకుంటాడని పై వచనములో బసవణ్ణ గారు చెప్పడం జరిగింది.

బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి

*
Previous అడుగడుగు దివ్యక్షేత్రము ఊరిలోనికి క్రొత్త వాళ్ళు వస్తే Next