లింగాయత -దేవుని స్వరూపము | శరణమేళము - బసవక్రాంతి దినము |
లింగాయత ధర్మముములో దేహమే దేవాలయం |
-మడపతీ.V. V, జహీరాబాద్.
దేవుడు అనే విషయాన్ని గురించి ఎంతోమంది ఎన్నోరకాలుగా వివరించి, ఆచరించడం జరుగుతుంది. నేడు అందులోని సత్య అసత్యాలను గమనించి నిజమైన దైవస్వరూపాన్ని పొందేందుకు నిజమైన భక్తి సామరస్యాన్ని పెంపొందించేందుకు నేటికాలములో భక్తిభంఢారి బసవేశ్వరుని వచనాలు మరియూ బసవాది శరణుల వచనాలు ఎంతగానో మనకూ సంతృప్తిని పెంపొందిస్తాయి.
ధనవంతులు, ఆర్థికంగా ఉన్నవారు,మరియూ పేరు ప్రతిష్టలకై ధన సముపార్జననే లక్ష్యగా పెట్టుకొని కట్టుబడే దేవాలయాలు వాటినుండి బీద కడు బీదవారలను మాయామాటలు చెప్పి శోషణ చేయడమూ 12 వ శతాబ్దములో ఉంది ఇప్పుడూ కూడా మన కనింటికి కనబడుతూనే ఉంది. దీనికి కారణం, *బసవాది శరణుల తత్వాలను వారి ఆలోచనా విధానాలు వచనసాహిత్యం 700 సంవత్సరాలవరకు మరుగున పడడమే అని తెలుసుకోవచ్చు.
ఆనాడు విశ్వగురు బసవేశ్వరుడు చేపట్టిన మహా కార్యమందు దేవాలయ ఆచార వ్యవస్తను వైధికుల శోషణాలను అణిచివేసే ప్రయత్నం చేయడం జరిగిందని వారి వచనాలలో వ్యక్తగతం అవుతుంది. దీనికి నిదర్శనం వారి వచనమందే గోచరిస్తుంది.
"కలవారు శివాలయం కట్టించారు
పేదను నేనేమి చేయగలనయ్యా
నా కాళ్ళె స్థంభాలు, దేహమే దేవాలయం
శిరస్సు పసిడి కలశమయ్యా
కూడల సంగమదేవా వినవయ్యా
స్థావరానికి క్షతివుంది, జంగమానికి లేదు."
*గురు బసవన్న/ 75*
పై వచనములోని చివరి వాక్యములో పూర్తి వచన భావార్థం దాగివుంది.
స్తావరానికి క్షతివుంది, జంగమానికి క్షతిలేదు
ఇక్కడ స్ధావరం అనేది రాతితో కట్టిన గుడులు గుండారాలు దేవాలయాలు ఒకానొకరోజు అంతమైపోతాయి. కాని కాని జంగమ స్వరూపముగా భావించే ప్రతీ కణ కణములో అణువణువులో దాగివున్న పరశివతత్వము ఎన్నడూ నాశనము కాదు.
ఈ విధముగా బసవేశ్వరుడు జాతీ మత కుల వర్ణ వర్గ భేధ భావనలు లేకుండా ఏక దేవోనిష్ఠ సమాజనిర్మాణమే ధ్యేయంగా వచనసాహిత్యాన్ని రచించడమైనది.
అప్పడు మొట్టమొదటి పార్లమెంటు అనిపించబడే అనుభవమంటప శూన్యపీఠాధ్యక్షుడు అల్లమా ప్రభుదేవుడు తన వచనములో దేవుడూ మరియూ దేవాలయాల గురించి అంతు చిక్కని విషయాన్ని సనాయాసంగా తన వచనములో వ్యక్తపరిచారు.
"దేహంలో దేవాలయముండి
మరివేరే దేవలయ మేలయ్యా
రెండింటిని చెప్పరాదయ్యా
గుహేశ్వరా నీవు రాయివైతే నేనేమౌతాను? - "
*అల్లమప్రభు/541 [1]*
అని దేవునికే సవాలు చేసిన మహా శివశరణులు బసవాది శరణులు, ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.
దేవుని నిజస్వరూపాన్ని మనందరికీ తెలియజేయడంలో విశ్వగురు బసవేశ్వరుని కంటే సాటి మరొకరు లేరు అని చెప్పడంలో సందేహమేలేదు. దానికి ఈ కింది వచనాలే సాక్షి.
ఎందెందు చూసినా అందందు నీవే దేవా!
సకల విస్తారపు రూపు నీవే దేవా
“విశ్వతో: చక్షు” వు నీవే దేవా
“విశ్వతోముఖుడవు” నీవే దేవా
“విశ్వతో బాహు”వు నీవే దేవా
విశ్వతో పాదమీవే దేవా, కూడల సంగమదేవా!
"బసవాది శరణుల వచనాలు అందరూ చదవాలి అందరికీ చదివించాలి"
అందరికీ అనంత శరణూ శరణార్థులు.
లింగాయత -దేవుని స్వరూపము | శరణమేళము - బసవక్రాంతి దినము |