Previous లింగాయతము ఒక ధర్మము పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి Next

లింగాయత శబ్దముయెక్క అర్థము

భువికంటె దివికంటె వెడదయ్య ని వెడద;
పాతాళమునకంటె వెడదయ్య శ్రీచరణము;
బ్రహ్మాండమునకంటె పైపైన శ్రీమకుటము;
అగమ్య అగోచర అప్రతిమ లింగమా
నా కరస్థలమున చిక్కి చుళుకైతివిగదయ్యా -గురు బసవ వచనము

విశ్వమునంతటిని బాహ్యాంతరములయందు నింపుకొన్న పరమాత్మ విరాడ్రూపి. అతడు అంతర్యామియూ అగును అతీతుడూ అగును; ఇట్టి పరమాత్మ చిన్న ఆకారమునందు ఇష్టలింగరూపమున కరకమలమునకు వచ్చును. ఈ ఇష్టలింగము విశ్వరూపియైన మహాలింగముయొక్క చిన్నరూపము. చైతన్యమయమైన ఏ పరవస్తువువలన సచరాచర సృష్టియంతయూ బయటికి వచ్చినదో ఎచ్చట లీలగాతోచుచున్నదో ఎచ్చట అణగిపోవుచున్నదో అట్టి సచ్చిదానందరూపియైన పరమాత్మమునకు లింగాయత ప్రక్రియయందు "లింగము" అని పిలుచుట అగుచున్నది. ఇట్టి పరవస్తువును విశ్వముయొక్క ఆకారమయిన గొళాకారమునందు చిన్నదిగా చేసికొని శరీరముపై ఛరింఛినవాడె "లింగాయతడు". లింగాయతడు లింగవంతుడనియొ పిలువబడును. ధనముగలవాడు ధనవంతుడు; గుణముకలవాడు గుణవంతుడు; విద్యకలవాడు విద్యావంతుడు; అట్లె లింగము కలవాడు లింగవంతుడు దానిని శరీరముపై దాల్చనివాడు లింగవంతుడుకాడు. లింగాయతునకు వీరశైవుడు, లింగాంగి, లింగసంగి, జంగముడు, సిరిజంగముడు, బసవ భక్తడు అని కూడా పెర్లుగలవు. విశిష్ట ప్రాంతములందు విశిష్టములైన పెర్లుగలవు. ఈ ధర్మముఅన్కు తప్పని నేమము ఇష్టలింగధారణము. లింగముయొక్క ధారణవలన ఒక వ్యక్తి లింగాయతుడగునే కాని జననము వలనకాదు. జన్మత: లింగాయతుడుని చెప్పుకొని ఇష్టలింగమును ధరింపవానిని వ్రతభ్రష్టుడు, సమాజబాహ్యాడు అని శరణలు స్పష్టముగా పిలుతురు.

ఎదో కారణమువలన లింగమును తిసివైజన్మత: నేను లింగాయుతుడను అని అబద్ధమును పలుకువానిని గురు బసవణ్ణగారు తీక్ష్ణముగా ఖండింతురు.

లింగములేక నడచువారల లింగములేక పలుకువారల
లింగములేక యెంగిలి మ్రింగిన
అప్పటప్పటికే దోషమేమందు నేమందు
లింగములేక నడచువాని అంగము
లౌకికము ముట్టరాదు, లింగహీనునిమాట
సూతకము వినరాదు, లింగములేక కలియుగ
ఆ నడనుడలు వ్రతమునకుచేటగు కూడలసంగమదేవ

ఇష్టలింగదేవుని అంగముపై ధరించుట అత్యవశ్యకమైన మొదటి నియమము. అట్లు ధరించినవాడే లింగాయతుడు.

సూచిక (index)
*
Previous లింగాయతము ఒక ధర్మము పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి Next