Previous లింగాయత యొక్క ముఖ్యమైన పండుగలు (ఉత్సవాలు) లింగాయతుడు ఎవరు? Next

లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్య

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

ప్రతియొక్క సమాజమునకు ఒక ఆధార సాహిత్యము కావలసియుండును. ఆ తత్వముయొక్క అనుయాయులు చిక్కుదిక్కులకు వెళ్లిపోకుండునట్లు సంఘటితముగా నిలువవలెనన్నచో వారికందరికి ఒక సూత్రాత్మక నాహిత్యముయొక్క ఆవశ్యకత కలదు. క్రిశ్చియనులకు బైబల్, ఇస్లామియలుకు కురాను మిగిలినట్టుగా లింగాయత ధర్మమునకు వచన శాస్త్రమే ఆధార సాహిత్యము. దానియందు వచన సాహిత్యము సంపూర్ణమైన అధికారమునులోగొన్నవి - బసవణ్ణగారి షట్ స్థలవచనములు. బసవణ్ణ మొదలుగ, సకల ఆది శరణుల వచనములే మన నడతలకు, మాటలకు, ఆచరణములకు దారి చూపునట్టి సాహిత్యమని లింగాయతుడు తెలిసికొనవలెను. అనంతరము వచ్చిన తోంటద సిద్ధలింగేశ్వరులు, షణ్ముఖస్వాములు, మగ్గెయ మాయిదేవులు, మున్నగువారి వచనములు ఆది శరణుల తాత్విక సూత్రములకు వ్రాసిన భాష్యములవలెనున్నవి. తరువాత వచ్చునటి శివయోగి సాహిత్యమైన నిజగుణుల, ముప్పిన షడక్షరుల, సర్పభూషణుల, బాలలీలా మహాంతయొగుల - ఇంకను ఎంతో మంది శివయోగుల సాహిత్యము కూడ లింగాయత పరంపరయందుకలదు. అంతేకాక, బసవాది ప్రమధులు మొదలుకొని తరువాత వచ్చిపోయిన అనేక శరణులపైరచింపబడిన పురాణ - కావ్య సాహిత్యము కూడకలదు. వీనియన్నింటి స్థానమును ఇట్లు నిర్ణయింపవచ్చును. బసవాది ప్రమధుల వచన సాహిత్యము లింగాయతధర్మముయొక్క పఠ్యపుస్తకమువంటిది (Text books), శ్రీ సిద్దలింగేశ్వరులు, షణ్ముఖస్వాములు, మాయిదేవులు మున్నగువారి వచన సాహిత్యము ప్రధమ స్థాన ప్రమాణగ్రంథములు (Reference books), నిజగుణులు, ముప్పినార్యులు, శివయోగి . శివాచార్యులు మున్నగువారి శివయొగిసాహిత్యము ద్వితీయస్థానప్రమాణ గ్రంథములు హరిహరుడు, రాఘవాంకుడు, చామరసుడు, మొదలగువారినుండి వచ్చిన పురాణసాహిత్యమంతయు తృతీయస్థాన ప్రమాణ గ్రంథముల గణనకువచ్చును.

(వ్యక్తుల జీవన చరిత్రను తెలిసికొనుటకు పురాణహిత్యము నహాయకము కావచ్చును. ధర్మముయొక్క వైచారిక భాగమైన సైద్ధాంతిక విషయముల దృష్టిలో ఇవి తృతీయస్థాన ప్రమాణగ్రంథములగుచున్నవి ఎందుకనగా శరణులు ఒప్పుకొనని కైలాసలోకపు కల్పనవంటివి అనేక పురాణములందువచ్చుచున్నవి. వీనియందు శరణులోప్పిన శివయొగ ఇష్టలింగ శ్రేష్ఠత కూడవచ్చును.)

ఈ ప్రకారముగా తెలిసికొని బసవాది శరణులయొక్కవచనముల ఆధారముపై ఆచార - విచారములను రూపించుకొనువారే నిజమైన లింగాయతులు. సిద్దరామేశ్వరులు తమ 857వ వచనమునందు ఇట్లు చెప్పియున్నారు.

నమ్మ నడావళిగే నమ్మ పురాతర నుడియే ఇష్టవయ్యా
స్మృతిగళు సముద్రద పాలాగలి
శృతిగళు వైకుంఠవ సేరలి
పురాణగళు అగ్నియ సేరలి
ఆగమగళు వాయువ హౌందలి
ఎమ్మశరణర నుడి కపిలసిద్ద మల్లికార్జున
మహాలింగద హృదయళ గ్రంథియాగిరలి

ఎమ్మ వచనదోందు పారాయణక్కె వ్యాసన
దొందు పురాణ సమబారదయ్య
నమ్మ వచన నూరెంటర అధ్యయనకే
శతరుద్రాదియాగి సమబారవయ్యా
ఎమ్మ వచన సాసిరద పారాయణక్కె
గాయత్రి లక్షజప సమబారదయ్య
కపిల సిద్ధమల్లికార్జున (సి.వ. 859)

శ్రీ సిద్దరామేశ్వరులు చెప్పునట్లుగా లింగాయతుని నడతలకు మాటలకు వచనములే ఆధారశాస్త్రము. వారిని అనుయాయులు పారాయణము అధ్యయనము చేయవలెను.

(అనేక లింగాయత మఠములందు తమమూల సాహిత్యమైన వచనసాహిత్యము కన్నడ భాషలయొక్క మొహమునకంటే సంస్మతాభిమానము మితిమీరి వచ్చినది. దాని పరిణామముగా వారియందును వారియనుయాయులందున అప్రత్యక్షముగా సాంప్రదాయిక ఆచరణలు కలసివచ్చినవి. జ్ఞానపిపాసా దృష్టితో సంస్కృతము నేర్చిన తప్పుకాదు; కాని సంస్కృతమునందున్నదంతయా మాన్యమను భావనతో చాలామంది లింగాయత ధర్మముయొక్క కొన్ని విరుద్ధ తత్వములకు తమను అమ్ముకొనుచున్నారు.)

ఇట్టి అధ్యయన ఫలముగా స్వతంత్రమైన విచారశక్తిని రూపించుకొని సత్యార్థ నిర్ణయమునందు - శాస్త్ర ప్రమాణమునకంటే స్వానుభవ ప్రమాణమే శ్రేష్టమని లింగాయతుడు నమ్మవలెను. కావున మూఢసంప్రదాయమునకంటే సత్యమే శ్రేష్ఠమనియూ, వ్యక్తిప్రేమకంటే తత్వప్రేమయే శ్రేష్ఠమని సత్యార్థ నిర్ణయమునందు శబ్దప్రమాణ మునకంటెలోతైన అనుభవప్రమాణము శ్రేష్ఠమని స్వతంత్రముగ విచారణ చేయువాడే నిజమైన లింగాయతుడు.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous లింగాయత యొక్క ముఖ్యమైన పండుగలు (ఉత్సవాలు) లింగాయతుడు ఎవరు? Next