పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి
|
|

శ్రీ మాతాజిగారు చిన్మూలాద్రి చిత్కళయై 1946లో చిత్రదుర్గమునందు జన్మించి, విజ్ఞాన తత్త్వజ్ఞానముల స్నాతకోత్తర పదవిధారియై 1966లో పూజ్య శ్రీ సద్గురు లింగానంద స్వామివారినుండి జంగమదీక్షగైకొని, "మాతె మహాదేవి" అను పేరు ఒడిసి 1970లో విశ్వ వినూతన స్త్రీ జగద్గురు పీఠమునలంకరించి, భక్తి జ్ఞాన విరక్తుల దివ్య సంగమమై శోభించుచున్నారు.
"మాతాజి" అని ఆత్మీయ భక్తలుతో పిలువబడుచున్న వీరు చిరుప్రాయమునందే అపారమైన జ్ఞానము గడించి, జగత్తు జాగృతికై ఆ జ్ఞాన సుధను గ్రంథముల మూలకముగా జనులకు ధారపొయుచున్నారు. శ్రీ మాతగారల మొదటి కాదంబరి "హెప్పిట్ట హాలు" రాష్ట్ర సాహిత్య అకాడెమి బహుమానమును పొందినది. అక్కమహాదేవి జీవనమునగూర్చి "తరంగిణి" మాతగారి సిద్ధ హస్తమునుండి రూపునొందిన ద్వితీయ కాదంబరి. వీరు వ్రాసిన ఇతర శ్రేష్ఠ కృతులు బసవ తత్త్వ దర్శన, హిందు యారు? లింగాయత ధర్మకైపిడి మున్నగున్నవి.
నిర్భితత్వము, తత్త్వనిష్ఠ సత్యప్రియత, సమాజోద్ధారణమునకై తపనవిటిచే వైశిష్ఠపూర్ణత గాంచిన మాతజిగారు తమ అమొఘవాణినుండి జనులను ఆకర్షించి, ముదము గొలుపుచున్నారు. దైవిదత్త ప్రతిభ, అసమాన్య పాండిత్యము, దివ్య మధురవాణి, ప్రశాంత చిత్తముల సంగమమైన మాతాజిగారు విశ్వధర్మమణిని వెంటగొని స్వదేశ విదేశములందు సంచరించి భారతపు ఆధ్యాత్మిక సందేశమును యశస్వియై ప్రచారముగావించుచున్నారు.
Reference:
1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.
*