Previous బసవేశ్వరుడు మన ధర్మగురు లింగాయత - దేహమే దేవాలయం Next

లింగాయత ధర్మముములో దేవుని నిజ స్వరూపము

-మడపతీ.V. V, జహీరాబాద్.

లింగాయత ధర్మము/బసవాది శరణుల దృష్టిలో దేవుని నిజ స్వరూపము

నిప్పు తాకిన కరిగిపోవు లక్కదేవుడు,
మంటతాకిన మాడిపోవు చెట్టుదేవుడు,
అవసరమొచ్చిన అమ్మెడి లోహదేవుళ్ళు,
భయము గొలుపుతు జూచెడి భూమిలో దిగబడే దేవుడు, దేవుళ్ళెటులగుదురయ్యా
సహజ భావ నిజైక్యుడు కూడల సంగమ దేవుడు. - విశ్వగురు బసవేశ్వర

విశ్వగురు బసవేశ్వరుడు పై వచనములో చాలా చక్కగ దేవుని నిజ స్వరూపాన్ని చెప్పడం జరిగింది.

మైనంతో, కట్టెతో , అట్టపుట్టలతోమరియూ లక్కతో చేసిన దేవుళ్ళు నిప్పుతాకినంతటనే కాలి బూడిదైపోవును. ఇలాంటివి దేవుళ్ళని అనగలమా..? కడు బీద పరిస్థితిలో బంగారము, వెండి,ఇత్తడి, వస్తువులను అమ్మి తన అవసరాలను తీర్చుకొనెదరు. ఇలాంటి అమ్మె వస్థువులను దేవుళ్ళని అనగలమా..? భయము గొలుపుతు జూచెడి అంటే రాతిలోనో లోహాలతోనో చేసిన దేవుళ్ళు భిన్నమైనప్పుడు(పగిలిపోవడం లేదా కరిగిపోవడం) వాటిని పెద్దలు పూడ్చిపెట్టమంటారు. అలాంటి భూమిలో దిగబడే దేవుడిని దేవుళ్ళని అనగలమా..?
నిజ దేవుడు విత్తనములోని చెట్టలా, పాలలోని నెయ్యిలా, అణువులోని పరమాణువులా, మనలోనే సహజ భావుడై
నిజైక్యుడు ఉన్నాడు కూడలసంగమదేవుడు అని దేవుని నిజ స్వరూపాన్ని చెప్పడం జరిగింది.

నిజ లింగాయతులు మట్టి, చెక్క, రాతి, మరియూ ఆకార దేవుళ్ళను నమ్మరు, సకల ప్రాణికోటితో సహ - మనలోపల దాగియున్న నిరాకార ఆత్మ చైతన్య స్వరూపాన్ని మాత్రమే దేవుడని నమ్ముతారు.

*

దేవుని నిజ స్వరూపము

"ఎందెందు చూసినా అందందు నీవే దేవా!
సకల విస్తారపు రూపు నీవే దేవా
"విశ్వతో: చక్షు"వు నీవే దేవా
"విశ్వతోముఖుడ"వు నీవే దేవా
"విశ్వతోబాహు"వు నీవే దేవా
"విశ్వతో పాదమీవే" దేవా, కూడల సంగమదేవా! - "
*గురు బసవన్న/85 [1]*

"జగమంత, గగనమంత మిక్కిలియంత మీయంత
పాతాళనికి క్రిందుగా అట్టట్టు మీ శ్రీ చరణం
బ్రహ్మాండంపై అట్టట్టు మీ శ్రీ మకుటం
అగమ్య అగోచర అప్రతిమ లింగమా! కూడల సంగమదేవా
నా కరస్థలానికి వచ్చి చులక నైతిరయ్యా -"
*గురు బసవన్న/201*

"రాతిదేవుడు దేవుడుకాడు
మట్టిదేవుడు దేవుడుకాడు
కొయ్యదేవుడు దేవుడుకాడు
పంచలోహాలతో చేసిన దేవుడు దేవుడుకాడు
సేతురామేశ్వరము, గోకర్ణము, కాశి, కేదారము
మొదలైన అష్టావష్టి కోటి (86 కోట్ల) పుణ్యక్షేత్రాలు లోనున్న
దేవుళ్ళు దేవుళ్ళు కారు
*తన్ను తానెరిగి తానేమని తెలిసిన తానేపో దేవుడు చూడుమా*
అప్రమాణ కూడల సంగమదేవా! "
*గురు బసవణ్ణ 2444 [1]"*

ఇక్కడ ఇష్టలింగమనేది దేవుడు కాదు. ఇష్టలింగమనేది నిజమైన దైవస్వరూపాన్ని పొందేందుకు చేసే ప్రక్రియ అమూల్యమైన సాధనా కేంద్రబిందువుగా పరిగణించాలి. అదేవిధముగా వీర వైరాగ్యనిధియైన అక్కమహాదేవి తన వచనములో దేవుని యొక్క నిజ స్వరూపమును చాలా ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యే విదంగా వివరించారు.

"చావులేని, కీడులేని, రూపములేని, అందగాణ్ణి నేవలచాను.
ఎడంలేని కడయులేని, తెరవులేని, గురుతులేని
అందగాణ్ణి నేవలచాను. అమ్మలారా
భవములేని, భయములేని, నిర్భయుడందగాణ్ణి వలచాను. నేను
ఊరులేని, పేరులేని వానిని వలచాను. నేను
చెన్నమల్లికార్జునుడను మగని
ఎక్కెక్కువ నేవలచాను అమ్మలారా! -"
*అక్కమహాదేవి/1230 [1]*

ఈ వచనాన్ని బట్టి ఒక విషయాన్ని మనము గమనించాలి. *తల్లిదండ్రుల కారణమున జన్మించినవారు రెండు కాళ్ళు రెండు చేతులు ముక్కు నాలుక చెవి పంచ భూతాలతో ఏర్పడి జన్మించి దేహాన్ని వదిలినవారందరూ మహానీయులేకాని దేవుడు అనడానికి వీలులేదు.*
ఆకాలములోనే పడవను నడిపే నావికుడు అంబిగర చౌడయ్య తన వచనములో వివరించడం జరిగింది.

"అసుర మాలలు లేవు
త్రిశూల డమరుకం లేదు
బ్రహ్మ కపాలం లేదు
భస్మ భూషణం లేదు
వృషభ వాహనం లేదు
ఋషుల వద్ద ఉన్నవాడు కాదు
పైబడిన సంసారం గుర్తు లేదాతనికి
పేరేదీ లేదు అన్నాడు అంబిగర చౌడయ్య -" *అంబిగర చౌడయ్య/1387 [1]*

ఈ విధముగా బసవాది శరణులు దేహమే దేవాలయంగా మార్చుకొని ఇష్టలింగాన్నే అత్మలింగముగా చేసుకొని కాయకమే కైలాసముగా
ఆచారమే స్వర్గము ఆనాచారమే ప్రకారముగా, దయయే ధర్మానికి మూలముగా. ఆచరించి ఇతరులకు చెప్పినవారు మన పూర్వజులు అని చెప్పడం మనందరికీ గర్వకారణం.

బసవాది శరణుల వచనాలు అందరూ చదవాలి అందరిచే చదివించాలి, తాను ఆచరించాలి ఇతరులకు చెప్పాలి

*
Previous బసవేశ్వరుడు మన ధర్మగురు లింగాయత - దేహమే దేవాలయం Next