Previous లింగాయత చిత్రాలు లింగాయత శబ్దముయెక్క అర్థము Next

లింగాయతము ఒక ధర్మము

లింగాయతము ఒక ధర్మము, జాతి కాదు. పుట్టుకతొ మానవులను ఎక్కువ తక్కువగా విభజన చెయుట జాతి; పుట్టుకతొ అందరూ సమానలు అని ఘోషించి జాతి వర్గ వర్ణ భెదములెక ఆసక్తి కలవారందరూ దిక్షాసంస్కారమును పొందవచ్చునని చెప్పునది ధర్మము. ఈ ధార్మిక సంస్కారముతొ వ్యక్తి సాధించిన ఉన్నతివెత ఆతడు శ్రేష్ఠుడు, కనిష్ఠుడు ఆగుననునది ధర్మము లింగాయత ధర్మము పుట్టుకచెత ఎవరిది ఎక్కువ తక్కువ అని పరిగణింపక "మానవుడు అజ్ఞాని; జ్ఞాని శరణడు" అని బోధించును. అజ్ఞానియగు మానవుడు జ్ఞానియైన శరణుడగుటకు కావలసిన దీక్షా సంస్కారమును, పూజా స్వాతంత్రమును అందరికె ఇచ్చును. అందువలన ఇది ధర్మము.

లింగాయత ధర్మము సత్త్యమునందు, తత్త్వమునందు విశ్వ ధర్మ లక్షణములను లొగొన్నది. కాని దాని అనుయాయులకు, అన్య సమాజ ధర్మ ములవారికి దాని నిజమైన పరిచయములెదు. ఈ నాటి లింగాయతులు చెయు ఆచరణలను చూచి, వాని వికృత, శిథిల స్వరూపమును గమనించి ఎవరుకూడ ఈ ధర్మముయొక్క శ్రేష్ఠతను కలయందును, మనస్సునందున భావింపలెరు. తప్పైన ఆచరణము అన్య ధర్మియుల మిద వివిధ పరిణామము కలగించును.

ఒక సైద్ధాంతిక ఘటనము (Constitution) ధర్మమనిపిమ్చుకొనుటకు దానికి తనదే ఆయిన ఏకాదశలక్షణములుండవలయును. అవి ఏవనిన- జీవము, జగత్తు ఈశ్వరడు - వీరి సంబంధమును వివేచన చేయు సిద్ధాంతము; ఈ సిద్ధాంతమును ఉపయోగించుకొనుటకు ఒక సాధనము; సాధనముచే సిద్ధాంతమును సాక్షాత్కరింప చెసికొన్నదానిని తెలుపు అనుభావపూర్ణదర్శనము; ఈ తత్వముయెక్క అనుయాయి కావలెనని కోరు వ్యక్తికి కావలసిన దీక్షాసంస్కారము; ఈ సమాజముయొక్క అనుయాయి తన సమాజముతొను అన్య సమాజముతోను ఏ తత్వముయోక్క ఆధారముననుసరించి జివింపవలేనను సమాజ శాస్త్రము; మానవులు ఏ క్రీయవలన పరులకు హితము చెయవచ్చును; వారి వ్యవహారములు ఎట్లుండవలెనని తెలుపు నీతి శాస్త్రము; సమాజ రాష్ట్రముల అంగమయన వ్యక్తి రాష్ట్రముయొక్క ఆర్థికాభివృద్ధియందు ఎట్లు భాగమువహింపవలెనను చెప్పు అర్థశాస్త్రము; అన్యసమాజయొక్క ఆచరణముకంటె భిన్నమైన సంస్కృతి; ఈ అన్ని తత్వములను ఉపయొగించుకొనిన ఒక పరంపర; వినినన్నంటిని వివేచన చేయు సాహిత్యము; ఇట్లు పలువిధములయన తత్వములుగల ఒక పథకమును చెసియిచ్చిన ధర్మగురువు - ఈ పదుకోండు లక్షణములువున్ననే అది ధర్మము, లెకున్న అది జాతి (Caste), లెక మతము (Faith).

ఈ దృష్టితొ చూచినప్పడు లింగాయత ధర్మమునకు శూన్య సిద్ధాంతముకలదు; లింగాంగయోగమను సాధనకలదు; షట్ స్థలమను దర్శనము కలదు; ఇష్టలింగదిక్ష యను ధర్మ సంస్కారముకలదు; అప్రాకృతము లేక అతివర్ణాశ్రమ సమాజ సాస్త్రము, మానవీయ నీతిశాస్త్రముకలదు. "కాయకమె కైలాసము", "దాసోహమె దేవధామము" అను అర్థశాస్త్రముకలదు. అన్య సమాజములకంటె బిన్నమైన శరణ సంస్కృతికలదు; మంత్రపురుషలైన బసవణ్ణగారు మొదలుగా ఆనాటినుండి అవ్యావతముగా వచ్చిన శరణపరంపరకలదు; వినిన్నంటిని ఆశ్రయించిన వివేచనాత్మకమయిన స్వతంత్ర వచన సాహిత్యముకలదు. ధర్మమునకు ఆద్యులై పథనిర్మాపకులై వచనసాహిత్య సంవిధానముయొక్క కర్తలైన బసవణ్ణగారను ధర్మగురువు కలడుకావున లింగాయతము, గొల్ల, హరిజన, కాపు, రెడ్డి, నాయిక, దేవాంగ, మున్నగువానివలె జాతికాక స్వతంత్ర ధర్మమగుచున్నది. జాతిని త్యజించి ధర్మవంతుడు కావచ్చును; గూల్లవాడు లింగదీక్షను పోంది లింగయతుడు కావచ్చును; ఎందుకనగా పుట్టుకతో వచ్చునది జాతి, సంస్కారముతో వచ్చునది ధర్మము. లింగాయత ధర్మము సంస్కారమువల్ల వచ్చును. దినిని ప్రవేశించుటకు అందరికి హక్కు కలదు. ఇది ఏ జాతియొక సొత్తుకాదు.

Reference:

1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
*
Previous లింగాయత చిత్రాలు లింగాయత శబ్దముయెక్క అర్థము Next