Previous చెవినుండి పుట్టినవారు కలరే భూమిపై ? లింగాన్ని తెలియనివాడు Next

రేపు మాపు మరొక్కనాడు అనబోకురా

- మడపతీ.V. V, జహీరాబాద్.

లింగవంతులైన శరణుడు నాడూ నేడూ మరునాడు అనే భ్రాంతి ఉండరాదు అనే.. ...

లింగాయత ధర్మగురు బసవేశ్వరుని వచనము

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||

"రేపు మాపు మరొక్కనాడు అనబోకురా ,
దినమిదే శివశరణను వానికి
దినమిదే హరశరణను వానికి
దినమిదియే కూడలసంగని నమ్మి కొలుచువానికి. "
సమగ్ర వచన సంపుటం : 1 వచనము సంఖ్య : 174

వచనానుభావము:ప్రతి రోజూ ప్రొద్దు ప్రొద్దునే, దేవునికి భక్తునికి మధ్యవుండే దళారులు తమ దుకాణములు తెరచి జాతకాలు, వంచాంగాలు, జ్యోతిష్యం, తిథులు అంటూ జనసామాన్యులను మానసిక భయోత్పాతానికి గురిచేసి డబ్బు దండుకుని సంబరపడతారు . అలాంటి వారలకు బసవణ్ణ గారి ఈ వచనము చెంప పెట్టు లాంటిది.

"రేపు మాపు మరొక్కనా డనబోకుర ;"

చూడని రేపటి గురించి, తెలియని మాపటి గురించి, తెలుసుకో సాధ్యము కాని మరునాటి గురించి ఆలోచించి అమూల్యమైన సమయాన్ని వృధా చెయ్యరాదని పై వాఖ్యములో చెప్పడం జరిగింది.

"దినమిదే శివశరణను వానికి
దినమిదే హరశరణను వానికి"

ఈ దినమే మన చేతిలో ఉంది. ఈ దినమే మన పనిలో ఉందని, ఈ క్షణమునుండే శివశరణులకు శరణు చొచ్చుటకు ఈ క్షణమునుండే హరశరణులకు శరణు చొచ్చుటకు పరమ యేూగ్యమైందని ఈ వాక్యములో గమనించవచ్చు.

"దినమిదియే కూడలసంగని నమ్మి కొలుచువానికి. "

ఈ దినమే కూడలసంగని నమ్మి కొలచువానికి అంటే ; కూడలసంగమ క్షేత్రమందు ఉన్న స్థావర లింగాన్ని కొలవమని కాదు. ఈ కొరోనా సమయంలో ఎక్కడ పోయినా ఆయన దొరకడు. అలా ఇప్పుడే కాదు ఎప్పుడూ లింగాన్ని ధరించిన లింగవంతుడు పోయే అవసరం కూడా లేదు. ప్రతి రోజూ కైలాసమనే తమ తమ ఇంట్లోనే ఇష్టలింగపూజ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టంగా చేసుకొని నమ్మి కొలవాలని ధర్మగురు బసవణ్ణ గారు చెప్పడం జరిగింది.

బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి

🙏 శరణు శరణార్థి 🙏

*
సూచిక (index)
Previous చెవినుండి పుట్టినవారు కలరే భూమిపై ? లింగాన్ని తెలియనివాడు Next