Previous ఆచార భ్రష్టుని గురించి లింగాయత ధర్మం Next

జాతి జంగములు కోట్లనుకోట్లు

- మడపతీ.V. V, జహీరాబాద్.

శూన్యపీఠాధిపతి అల్లమాప్రభుదేవుని వచనము

🌽 ఓం శ్రీ గురు బసవ లింగాయనమః 🌽

శూన్యపీఠాధిపతి అల్లమాప్రభుదేవుని వచనము

జాతి జంగములు కోట్లనుకోట్లు.
నీతి జంగములు కోట్లనుకోట్లు.
సిధ్ధ జంగములజాతి జంగములు కోట్లనుకోట్లుు కోట్లనుకోట్లు.
జ్ఞాన జంగములు త్రైలోక్య దుర్లభం గుహేశ్వరా. సమగ్ర వచన సంపుటం: 2, వచనము సంఖ్య: 1203


వచనానుభావము: జంగములు అని చెప్పుకొని తిరిగే వారందరిలోనూ అందరికంటే జ్ఞానాన్ని ప్రసాదించే జంగములే శ్రేష్ఠులు అనే విషయాన్ని గురించి ప్రప్రథమ శూన్యపీఠాధిపతి అల్లమాప్రభుదేవుడు తన వచనములో ఈ విధంగా చెప్పడం జరిగింది. (జంగమము = సుజ్ఞానముతో జీవించే వ్యక్తి)

జ్ఞాన జంగములు: నిజమైన జ్ఞాన జ్యోతిని సమ సమాజములో వెలిగించే జంగమ స్వరూపులు.

"జాతి జంగములు కోట్లనుకోట్లు." జాతిలో ఉచ్ఛ స్థానమున పుట్టినామని, మేమే గొప్పవారలమని ఇతరులు తక్కువ వారని మాట్లాడుతూ, అందరూ ఒకే విధంగా పుట్టి, ఒకే విధంగా జీవించి, ఒకే విధంగా ప్రాణము పోతుందనే విషయాన్ని మరిచి, కేవలం జాతి పరంగా చెప్పుకొని తిరిగే వాడు జాతి జంగముడు. ఇటువంటి వారు కోట్లాది కోట్ల మందిని మనము గమనించవచ్చు.

"నీతి జంగములు కోట్లనుకోట్లు." ఇదే విధంగా చెయ్యాలి, అదే విధంగా చెయ్యాలి, నేను చెప్పిందే వేదం, నేనే అంటినికీ కర్త కర్మ క్రియ అని పలికి తన క్షణిక దైహిక ఆనందం పడే ఈ దేహము ముసలితనంగా మారిపోయి క్షిణించి పోతుందన్న విషయాన్ని మరిచిపోయి తనకు తోచిన అపరిపూర్ణమైన నీతిని నియమాలను అందరికీ చెప్పుకుంటూ పోయే వాడు నీతి జంగములు ఇటువంటి వారు కూడా కోట్లాది కోట్ల మందిని గమనించవచ్చు.

"సిధ్ధ జంగములు కోట్లనుకోట్లు." భూత, భవిష్యత్తు, వర్తమానాలు నాకు చాలా చక్కగా తెలుసని, దైవం ప్రసాదించి అమూల్యమైన సమయాన్ని ఖండ ఖండాలుగా చేస్తూ, రాహుకాలము, గుళిక కాలము, దుర్ముహూర్తం, శుభముహూర్తం, యమగండ కాలము అంటూ చెప్పి, పరమేశ్వరుడు ప్రసాదించిన తన ఉచ్ఛ్వాస, నిఛ్వాసాలు ఎప్పుడు పోతాయో తానే తెలుసుకోలేకుండా అమూల్యమైనది ప్రతీ క్షణమని తెలుసుకోక పోయిన జంగములు, సిద్ధ జంగములు. ఇటువంటి వారు కూడా కోట్లకు కోట్లుగా మనకు దొరుకుతారు.


"జ్ఞాన జంగములు త్రైలోక్య దుర్లభం గుహేశ్వరా.": 'దేహమే దేవాలయం', 'ఆచారమే స్వర్గం అనాచారమే నరకము,' 'దయయే ధర్మానికి మూలము', కాయకమే కైలాసము', మన ఇష్టలింగములోనే సృష్టి, స్తితి, లయకు కారణమైన పరమేశ్వరుడు ఉన్నాడని, దైవము అక్కడా, ఇక్కడా, ఎక్కడా వెతికితే ఏమైనా అంగట్లో దొరికే వస్తువు కాదని, దైవము మనలోనే ఉన్నాడని చెప్పి సభ్య సమాజాన్ని సుజ్ఞానము వైపుగా నడిపించే వాడే నిజమైన జ్ఞాన జంగముడు. ఇటువంటి వారు త్రైలోకాలలో కూడా దొరకడమే దుర్లభం అని ప్రప్రథమ శూన్యపీఠాధిపతి అల్లమాప్రభుదేవుడు తన వచనములో చెప్పడం జరిగింది.

బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచేత చదావించాలి. తానూ ఆచరించాలి ఇతరులచేత ఆచరించేటట్టు చెయ్యాలి.

🙏 శరణు శరణార్థి 🙏

సూచిక (index)
Previous ఆచార భ్రష్టుని గురించి లింగాయత ధర్మం Next