మనం చేసుకున్న అదృష్టమో బసవేశ్వరుడు మన ధర్మగురువుకావడం
|
|
చరిత్రను చదివితే 12 వ సంవత్సరానికంటే పూర్వము చాలా మూఢనమ్మకాలు, అంధవిశ్వాసము, అశ్పుర్శత, లింగ అసమానత్వం, జాతి వర్ణ వర్గ లింగ బేధం చూపడం ఆనాడు మరీ ఎక్కువగా ఉండేది... ఒకవేళ్ళ బసవేశ్వరుడే ఈ భువికి రాకపోతే పైనున్న అసమానతలన్ని ఇప్పుడూ కూడా తాండవం చేసేవి.. అది గమనించిన బసవేశ్వరుడు..
ఆనాడే 12 వ శతాబ్దములో మూఢ నమ్మకాలు, అంధశ్రధ్ధులను రూపుమాపడాని కంకణం కట్టుకున్నారు. బసవేశ్వరుడు చదవని గ్రంధమనేదే లేదని కొన్ని వచనాలలో శరణలు పేర్కనడం జరిగింది.
సర్వమూ తెలుసుకొన్న బసవేశ్వరుడు 8 వ ఏటలోనే తన అక్కకోసం సమానత్వానికి ఎదురుతిరిగి, జంధ్యాన్ని వదులుకొని కులాలలో పెద్దకులమైన శైవ బ్రాహ్మణ కుటుంబాన్ని వదిలి తన జీవితం మొత్తం శూదృలకై అంటువారులను పైకెత్తడానికై ఆడవారిని విద్యవేత్తలుగా మార్చి ఒక క్రొత్త జాతి వర్గ వర్ణ లింగ భేదము లేకుండా అందరూ సమానమే అని,
ప్రపంచానికే సవాలు వేసే విధముగా 12 వ శతాబ్దములోనే సుమారు 35 మంది మహిళా శరణీయులకు అక్షరాభ్యాసన వేదశాస్త్రలను నేర్పి వాటిలోవున్న తప్పోప్పులను పసిగట్టి వచనాలు రూపములో అంబృతాన్ని పంచడం జరిగింది.
కాని, నేటి పరిస్థితిని గమనించినట్లైతే, బసవేశ్వరుని వచనాలను మూలకుపెట్టి ఆయన చెప్పిన తత్వాలను పక్కకు పెట్టి, ఆయన కలలుగన్న ఆశయాలను మనమే నేలకూల్చేప్రయత్నం చెయ్యడం క్షమించరాని ఆత్మద్రోహముతో సమానం.
దీని విషయానికై చింతనము చెయ్యండి అంతేకాని, గృప్లను ఏవేవో విషయాలను ప్రస్థావిస్థూ తమ తమ మనస్సులను పాడుచేసుకుంటూ ఇతరుల మనస్సులను కూడా నొప్పిస్థున్నారని మరవవద్దు..
అందరూ గమనించాలి..
అందరూ ఆలొచించాలి..
అందరూ తెలుసుకోవాలి..
అందరూ నడుచుకోవాలి..
అందరూ మన వచనసాహిత్యాన్ని చదవాలి,
చదివినట్టు అందరూ పాటించాలి..
బసవేశ్వరుడు చెప్పినట్టుగా..
"తనను తాను తెలుసుకుంటే తానే దేవుడనే" స్థానానికి అందరూ ఎదగాలి.
"భక్తుడొక కులము భవి ఒక కులమని" చెబుతూ భవులను భక్తులుగా మార్చిన విశ్వగురు బసవేశ్వరుడు, ఎన్నొ ఎన్నెన్నో మనకు అంతుపట్టని ఆలోచనలను వచనాల రూపంలో రాసి మనందరికీ అంబృతాన్ని పంచిన మహా ఘనుడు
"బసవాది శరణుల వచనాలు అందరూ చదవాలి అందరికీ చదివించాలి"
అందరికీ అనంత శరణూ శరణార్థులు.
*