శరణమేళము - బసవక్రాంతి దినము

కూడలసంగమనందు ప్రతి సంవత్సరం జనవరి 12, 13, 14 మరియు 15

*

ప్రతియొక్కధర్మములవాలును, తమ ఆదిగురువుల జీవనమునందు 3 దినములను మహత్యపు దినములని గుర్తించియున్నాం. వారి జనన దినము, లింగైక్యచెందిన దినము, నవధర్మ దష్ఠలైన దినము అనునవి. ఆది ప్రమథ బసవణ్ణగారు పుట్టినది వైశాఖ మాసపు రోహిణి నక్షత్రమందు, లింగైక్యముచెందినది శ్రావణ శుద్ధ పంచమినాడు. నవధర్మ ఘోషణ చేసినది మకర సంక్రాంతియందు.

జగత్తునందలి అన్ని ధర్మములవారు సంవత్సరమునకొకసారి ఒక స్థలమున చేరుదురు. ముస్లిములు హజ్ యాత్ర, సిక్కులు “ఖాల్సా” సమావేశము చేయునటు బసవతత్యానుయాయులు ఒకచోట చేరవలెనని “శరణ మేళ” ను యొజనచేసి 1988నుండి ప్రతి సంవత్సరము జరుపుచుండుటయగుచున్నది. శ్రీ గురుబసవ తండ్రిగారు తాముండిన కాలమునందే ఇట్టి గణసర్వములను చేసి, మాదిరివలె చూపియున్నారు.

కావున లింగవంత ధర్మియులు తమ జీవితావధియందు ఎన్నిసారులు సాధ్యమొ అన్ని సార్లు కూడలసంగమ క్షేత్రమందు బసవక్రాంతి దినమునాడు (ప్రతిసంవత్సరము జనవరి 13, 14, 15 తేదీలందు) నడచు శరణమేళమునకు రావలెను. దూరదూర రాజ్యములందు, దేశములందు ఉన్నవారు తమ జీవిదమునందు ఒక సారియైనను శరణమేళనందు పాల్గొనవలెను.

*
సూచిక్ (index)
Previousలింగాయత - దేహమే దేవాలయంలింగాయత యొక్క ముఖ్యమైన పండుగలు (ఉత్సవాలు)Next
Guru Basava Vachana

Akkamahadevi Vachana

[1] From the book "Vachana", pub: Basava Samiti Bangalore 2012.