Previous చేతుల్లో లింగపూజ మనసులో సంసార గుంజాట అడుగడుగు దివ్యక్షేత్రము Next

పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి

His holliness Dr. Shri Shivkumar Mahaswamy, పరమపూజ్య  శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి

సిధ్ధగంగ మఠ పూర్వ అధిపతి పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి

రామనగర జిల్లా మాగడి తాలూకా వీరాపుర గ్రామం లో  లింగాయత్ ధర్మానికి చెందిన హొన్నగౌడ మరియు గంగమ్మ దంపతులకు  13 వ సంతానం గా శివకుమార స్వామి జన్మించారు. ది. 01-04-1907 న జన్మించిన ఈ బిడ్డకు తల్లిదండ్రులు శివణ్ణ అని నామకరణం చేసారు. తుముకూరు జిల్లా నాగవల్లి గ్రామం లో ప్రాథమిక విద్య ను అభ్యసించిన శివణ్ణ , తుముకూరు లో 1922 లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసారు. ఆ తరువాత ఉన్నత విద్య ను బెంగళూరు లో సెంట్రల్ కాలేజి లో అభ్యసించారు.

1930 లో సిధ్ధగంగ పీఠాధిపతి శ్రీ మరుళారాధ్యులు లింగైక్యం చెందటం తో మఠం యొక్క ఉత్తరాధికార బాధ్యత ను శివకుమార స్వామి వారు స్వీకరించారు. అప్పుడు రుద్రాక్షలు , కషాయం ధరించిన శివకుమార స్వామి వారు మఠాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించారు. సిధ్ధ గంగ పీఠానికి అనుబంధము గా ఉన్న పాఠశాలలో విద్యార్థులకు ఆశ్రయం కల్పించి భోజన సదుపాయం కల్పించేందుకు శివకుమార స్వామి వారు భిక్షాటన కూడా చేసారు. స్వామి వారి ఆధ్వర్యంలో మఠం యొక్క విద్యాలయాలు అంచెలంచెలుగా వృద్ధి చెంది విద్యార్థుల సంఖ్య 12000 కు చేరింది , వీరిలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు.

1965 లో శివకుమార స్వామి వారు గౌరవ డాక్టరేట్ పొందారు. వీరికి 100 సంవత్సరాలు నిండినప్పుడు ఆ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం 'కర్ణాటక రత్న' పురస్కారం ఇచ్చి గౌరవించింది . 2015 లో భారత ప్రభుత్వం శివకుమార స్వామి వారికి పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి సన్మానించింది.

పరమపూజ్య , త్రివిధ దాసోహి శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి వారు 29-01-2019 న లింగైక్యం చెందారు.

సూచిక (index)
*
Previous చేతుల్లో లింగపూజ మనసులో సంసార గుంజాట అడుగడుగు దివ్యక్షేత్రము Next