Previous మణులు లెక్కించి కాలమును గడపకు చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం? Next

గురువువల్లనే బ్రతికి యున్నాను. ఇక నీ అవసరం ఎందులకు

- మడపతీ.V. V, జహీరాబాద్.

అనామిక నాచయ్య గారి వచనము

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||

బసవాది శరణుల వచనాలలో, దేవునికే సవాలు వేసిన వచనాలు ఎన్నో.. అందులోని ఒక సుప్రసిద్ధమైన వచనము

బసవాది శరణుడు అనామిక నాచయ్య గారి వచనము

పూర్వకర్మను త్రెంచివేశాడు నా గురువు,
ఉభయ కర్మను విడిపించి త్రెంచడం చూపించారు శరణులకు,
వారి నుండే జీవించాను.
చూపించాడు సద్భక్తులను ;
వారి నుండే‌ బ్రతికాను,
నాచయ్య‌ప్రియ మల్లినాథయ్యా.
గురువువల్లనే బ్రతికి యున్నాను.
ఇక నీ అవసరం ఎందులకు ? -సమగ్ర వచన సంపుటం : 6, వచనము సంఖ్య- 1050

భారత దేశ చరిత్రలోనే 12 వ శతాబ్దం బసవణ్ణ గారు మొదలు పెట్టిన భక్తి ఉద్యమము దేశం నలుమూలల నుండే కాక నాడు విదేశాలనుండి కూడా వచ్చి బసవణ్ణ గారి అనుభవమంటపములో శరణులుగా మారడం జరిగింది. నాటి కాలము నుండి విపరీతంగా భక్తి ఉద్యమము రాను రాను భక్తి యుగానికే నాంది పలికింది అనడంలో సందేహమే లేదు. అలాంటి భక్తి ఉద్యమము నుండే అనేక మంది ఎందరో కవులు, పండితులు, రచయితలు, సంత్ లు, తత్వ జ్ఞానులు పుట్టుకొని వచ్చారు అనడంలో అతిశయోక్తి కాదు.

పూర్వ కర్మను త్రెంచివేశాడు నా గురువు, ఉభయ కర్మను విడిపించి త్రెంచడం చూపించారు శరణులకు, వారి వల్లనే జీవించాను.

పై వాక్యములో బసవాది శరణుడైన అనామిక నాచయ్యగారు కర్మ త్రయాలతో (సంచిత కర్మ, ప్రారాబ్ది కర్మ, మరియూ ఆగామి కర్మ) సతమతమౌతూ జీవిస్తున్న మానవుడు, గురువు ద్వార హస్త మస్థక సంయొగము ద్వారా పూర్వజన్మములో చేసిన పాపాలైన (సంచిత కర్మ) త్రెంచి వేశాడని, ఇష్టలింగాన్ని నిష్టతో ప్రతీరోజూ పూజించడం వల్ల, వర్తమాన కర్మయైన (ప్రారాబ్థి కర్మ) హరించిపోతుంని, సత్య శుధ్ధ కాయకముతో జంగమ స్వరూపమైన జ్ఞానయుక్త సమాజానికి దాసోహం చెయ్యడం ద్వారా భవిష్యత్తు కర్మ (ఆగామి కర్మ) దరిచెయ్యదని చెప్పడం జరిగింది.

చూపించాడు సద్భక్తులను ; వారి వల్లనే బ్రతికాను నాచయ్య‌ప్రియ మల్లినాథయ్యా.

నాకు, సత్య - శుధ్ధముగా కాయకము చేసే సద్భక్తుల సాంగత్యమును నా గురువు బసవణ్ణ గారు చూపించాడు. చూపించాడు, నాకు నా గురువు బసవణ్ణ గారు అనుభవమంటపములో ఉంటే 770 అమరగణాలైన శరణుల సాంగత్యమును పరిచయం చెయ్యడం జరిగింది అని పై వాక్యములో చెప్పడం జరిగింది.

గురువువల్లనే బ్రతికి యున్నాను. ఇక నీ అవసరం ఎందులకు ?

గురువు, లింగము మరియూ జంగమము ద్వారా త్రివిధ కర్మములైన సంచిత కర్మ, ప్రారాబ్థి కర్మ, ఆగామి కర్మలు పటాపంచలౌతాయని, గురువు ద్వారానే నేను ముక్తిని సంపాదించానని ఇక నీ దయా దాక్షిణాత్యతో నాకు ఎందుకు ? అని దేవున్నే ప్రశ్నించే విధంగా దేవునికే సావాలు వేసే విధంగా చెప్పడం గమనార్హం.

ఇందులో విశేషమేమిటంటే ; బసవాది శరణుల తత్వ సారములే నాడు విపరీతంగా దేశం నలుమూలలా ప్రసరించి భక్తియే శక్తిగా మారింది అనడంలో మరో మాట లేదు. 12 వ శతాబ్దం నుండి సుమారు 300 సంవత్సరాల తరువాత 15 వ శతాబ్దంలో, ప్రఖ్యాత ఉత్తర భారత దేశపు ప్రఖ్యత కవి సంత్ కబీర్ దాస్ కూడా ఇలాంటి విషయాన్నే చెప్పడం గమనించాల్సిన విషయం.

गुरू गोविन्द दोऊ खड़े, काके लागूं पांय।
बलिहारी गुरू अपने गोविन्द दियो बताय।।

गुरू और गोबिंद (भगवान) एक साथ खड़े हों तो किसे प्रणाम करना चाहिए – गुरू को अथवा गोबिन्द को ? ऐसी स्थिति में गुरू के श्रीचरणों में शीश झुकाना उत्तम है जिनके कृपा रूपी प्रसाद से गोविन्द का दर्शन करने का सौभाग्य प्राप्त होता है।

అనే విషయాన్ని నాడు, బసవాది శరణుల తమ వచనములో చాలా చక్కగా వివరించడం జరిగింది.

బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి

🙏 శరణు శరణార్థి 🙏

*
సూచిక (index)
Previous మణులు లెక్కించి కాలమును గడపకు చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం? Next