Previous చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం? అష్టమి నవమి అనే కల్పనలు లింగధారికి ఉండరాదు Next

మనసు మైల కడగాలంటే?

- మడపతీ.V. V, జహీరాబాద్.

మనస్సు మాలిన్యం చెందినచో ఏమి చెయ్యాలి.!

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||

దివ్యజ్ఞాని చెన్న బసవేశ్వరుని సందేశం

నేటి కాలములో మనస్సు ఎన్నో రకాలుగా మాలిన్యం చెందుతుంది. ఆధ్యాత్మిక పరంగా ఏదో సంపాదిద్దామని, మరేదో సాధించాలని మనస్సులో తలచినంత మాత్రమే ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు, దారులు మనకు గోచరిస్తాయి. విటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ పోతే మనము చేరుకోవాల్సిన దారిని మరిచి వేరే దారిన పడిపోవడం సహజమే. అందుకే చెన్న బసవేశ్వరుడు ఈ క్రింది విధంగా చెప్పడం జరిగింది.

తలమాసితే మహామజ్జనం చేయాలి
గుడ్డ మాసితే చాకళ్ళకు వేయాలి
మనసు మైల కడగాలంటే
కూడల చెన్న సంగయ్య శరణుల
అనుభవం అభ్యసించాలి.


తల మాసిపోతే తలంటు స్నానంతో మాసిన తలను శుభ్రపరుచుకోవచ్చు. మనము ధరించే వస్త్రాలు మాసిపోతే చాకలకి ఇస్తే శుభ్రంగా ఉతికి ఆరేసి వాటిని శుభ్రపరుస్తాడు. ఒకవేళ మనస్సులో మాలిన్యం పెరిగితే దేనితోనూ శుభ్రం చెయ్యలేము కాని చెన్న బసవన్న గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అది కేవలం శరణుల అనుభావము వల్ల మాత్రమే మనస్సు మాలిన్యం పోతుందని పై వచనములో చెప్పడం జరిగింది.

శరణుల అనుభవాల రచనయే వచనాలు. చరిత్రను గమనిస్తే ఇతరుల జీవితాల గురించి తెలుసుకొని రాసిన వారు, తమ గురించే స్వీయ రచనలు చేసుకున్నవారు మరియూ ఎవరో చెబితే దానిని అనుసరించి రచనలు రచించిన వారున్నారు. కానీ 12 వ శతాబ్దంలోని బసవాది శరణులు తమ జీవితాల అనుభవాలనుండి చేసిన రచనలు ఇక వేటికీ సాటి రాదు. అందుకే సిధ్ధరామేశ్వరు తన ఒక వచనములో వచనము యొక్క మహాత్యం గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.

మా ఒక్క వచనము పారాయణము చేత వ్యాసుని ఒక పురాణము సమానము కాదు.
మా వచనములు నూట ఎనిమిది పారాయణము చేత శతరుద్ర యాగము సమానము కాదు.
మా వచనము లు వెయ్యి పారాయణము చేత గాయత్రీ లక్ష జపము సమానము కాదు, కపిలసిధ్ధమల్లికార్జునా.

బసవాది శరణుల వచనాలను ప్రతీ లింగవంతుడూ చదవాలి. వాటిని తన నిజజీవితంలో ఆచరించాಲಿ.

*
సూచిక (index)
Previous చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం? అష్టమి నవమి అనే కల్పనలు లింగధారికి ఉండరాదు Next