Previous అష్టమి నవమి అనే కల్పనలు లింగధారికి ఉండరాదు చెవినుండి పుట్టినవారు కలరే భూమిపై ? Next

శరణుల ముఖ్య నియమాలు ఏమిటి ?

- మడపతీ.V. V, జహీరాబాద్.

శివశరణి సత్యక్క గారి వచనము

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||

"అర్చన పూజ నియమము కాదు ;
మంత్రమూ తంత్రమూ నియమము కాదు ;
పరధనము - పరస్త్రీ - పరదైవమును ఆశించకుండా ఉండడమే నియమము .
శంభు జక్కేశ్వరునిలో చూడుమా ఇవే నిత్య నియమాలు.
సమగ్ర వచన సంపుటం : 5 వచనము సంఖ్య : 1207

వచనానుభావము: పై వచనము 12 వ శతాబ్దంలో కల్యాణ రాజ్యమునందు వీధులు ఊడిచే శరణి సత్యక్క గారి వచనము. బసవయుగము కంటే ముందు స్ర్తీలను అంటరానివారిలా చూచేవారు. విద్యను అభ్యసించడానికి వీలు కూడా ఉండేది కాదు. అటువంటి కాలములో సుమారు 30 మంది మహిళ వచనకారులను తయ్యారు చేసింది అనుభవమంటపమనే పార్లమెంటు విద్యావ్యవస్థ. వారి వచనాలు ఇప్పటికీ మనమంతా తలూపి అవును అనాల్సిందే.

"అర్చన పూజ నియమము కాదు ;
మంత్రమూ తంత్రమూ నియమము కాదు ;"


అర్చనా పూజలనే నియమాలు పెట్టి జనసామాన్యులను భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర నుండి మనస్సును, తనువును, ధనమును విఛ్ఛలవిడగా దోచుకునే వారు. అలాంటి సమయంలో సత్యక్క వచనములో అర్చనలు పూజలు అవేవి అసలు నియమాలే కావు అని చెప్పడం ఇప్పటికి నమ్మలేని చేదు నిజం. ఈ ఒక్క మాట వైదిక వ్యవస్థకు చెంపపెట్టు లాంటిది.

"పరధనము - పరస్త్రీ - పరదైవమును ఆశించకుండా ఉండడమే నియమము. శంభు జక్కేశ్వరునిలో చూడుమా ఇవే నిత్య నియమాలు."

నిజమైన నియమాలు ఏమిటి అనే నియమాన్ని సత్యక్కయే తన వచనములో చెప్పడం జరిగింది. పరుల-ధనమును, పరుల-స్ర్తీ సౌఖ్యమును, పరుల-దైవమును, ఇక్కడ పరదైవము అంటే లింగాయతునికి ఇష్టలింగము తప్ప వేరే దైవములన్నీ పరదైవములే; ఎప్పుడూ త్రికరణ శుద్ధిగా ఆశించకుండా ఉండడమే నిజమైన నియమాలు అని, ఆడంబరంముగా చేసే నియమాలకు విరుద్ధంగా సత్యాన్ని చెప్పడం, అంతే కాకుండా ఈ నియమాలే శంభుజక్కేశ్వరుడైన పరమేశ్వరునిలో నిత్య నియమాలని చెప్పడం జరిగింది.

బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి

🙏 శరణు శరణార్థి 🙏

*
సూచిక (index)
Previous అష్టమి నవమి అనే కల్పనలు లింగధారికి ఉండరాదు చెవినుండి పుట్టినవారు కలరే భూమిపై ? Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys