Previous లింగాయత ధర్మపు పోరాటం పుట్టుకతో ఎవ్వరూ శ్రేష్ఠులు కారు Next

అటునిటు పరుగులు పెట్టనట్లు నన్ను అవిటివాడిని చెయ్యి తండ్రి

*

-మడపతీ.V. V, జహీరాబాద్.

ధర్మగురు బసవేశ్వరుని వచనము

"అటునిటు పరుగులు పెట్టనట్లు నన్ను అవిటివాడిని చెయ్యి తండ్రి,
చుట్టూ సుడిగుండములో పడకుండా అంధున్ని చెయ్యి తండ్రి,
మరియొకటి విననీయక చెవిటిని చెయ్యి తండ్రి!
నీ పాదాల శరణు తప్ప అన్య విషయాలు నన్ను లాక్కొనిపోనీయకు కూడలసంగమదేవా.!"

వచనానుభావము:

ఈ సంసార సాగరం నుండి బయటికి పడడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకోవలసి వస్తుంది, అందుకే బసవాది శరణులు ఈ భవబంధాలనుండి విముక్తి పొందుటకై ఎన్నో దారులను చూపెట్టడం జరిగింది. పై వచనములో ధర్మగురు బసవేశ్వరుడు మన పంచేంద్రియాలను తన ఆధీనములో ఉంచుకున్నప్పుడే నిజ దేవుని దగ్గరకు చేరుకోగలమని వివరించారు.

అటునిటు పరుగులు పెట్టనట్లు నన్ను అవిటివాడిని చెయ్యి తండ్రి,
ఈనాడు మానవుడు దేవుని వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతూ అలసిపోతున్నారే తప్ప ఎక్కడా ఆయన జాడేకనబడలేదని అలిసిపోయినవాళ్ళే అధికము.
ఈ విధముగా నన్ను అటూ ఇటూ తిప్పక కుంటి వాడిని చెయ్యవయ్యా తండ్రి అని వేడుకుంటున్నారు.

చుట్టూ సుడిగుండములో పడకుండా అంధున్ని చెయ్యి తండ్రి,
సముద్రములో ఏర్పడే సుడిగుండములో ఏదైనా చేరితే బయటికి రావడం అసాధ్యమైనదని అందరికీ తెలుసు. అదే విధముగా మన చుట్టు మూఢనమ్మకాలతో ఎంతో మంది ఏదేదో చెబుతూ ఏదేదో చేస్తు సుడిగుండములోకి తీసుకెళతారు.. ఇలాంటి సుడిగుంఉలో నాకు పోనివ్వకుండా నాకు అంధున్ని చెయ్యవయ్యా తండ్రి.

మరియొకటి విననీయక చెవిటిని చెయ్యి తండ్రి!
ఈ కాలములో వేమన్న చెప్పినట్టు తప్పులెంచు వారు తమతప్పులెరుగరయ్యా విశ్వదాభిరామ వినురవేమ" అన్నట్టు ఇతరులపై చాడీలు చెప్పడం నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపమైన పరమేశ్వరునిపై వివిధ ఆకారాల్లో పోల్చి వర్ణించడం కీర్తించడం వంటివి నా చెవిలో పడకుండా చెవిటి వాడిని చెయ్యవయ్యా తండ్రి.! అని *బసవేశ్వరుడు వేడుకుంటున్నారు* చివరగా ఆయనకు ఏమి అవసరం అనేది ఈ విధంగా తెలిపారు.

నీ పాదాల శరణు తప్ప అన్య విషయాలు నన్ను లాక్కొనిపోనీయకు కూడలసంగమదేవా.!"
నీ పాదాల శరణు తప్ప అంటే - లింగాయతులైన మనము దిననిత్యము ఆరాధించే ఇష్టలింగము పై నిష్ఠ కలిగివుండడం. భహుదేవోపాసనను, ఆఢంబరాలను, మూఢనమ్మకాలపు వదిలించి ఏకదేవోపాసన వైపుగా నన్ను లాక్కోని పోవు కూడలసంగమదేవా, అని విశ్వగురు ధర్మగురువు బసవేశ్వరుడు తన ఇష్టలింగాన్ని వేడుకోవడం జరిగినది.

పంచేంద్రియాలను కన్ను, ముక్కు, నాలుక, చెవులు, చర్మం, దీనినే పంచ-అంగాలు అని రాను రాను పంచాంగం అని అనడం వినడం మనం గమనించవచ్చు, వీటిని అదుపులో ఉంచుకున్నవాడే నిజ లింగాయతుడు.

*
Previous లింగాయత ధర్మపు పోరాటం పుట్టుకతో ఎవ్వరూ శ్రేష్ఠులు కారు Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys