Previous శరణమేళము - బసవక్రాంతి దినము లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్య Next

లింగాయత యొక్క ముఖ్యమైన పండుగలు (ఉత్సవాలు)

*
1. బసవ క్రాంతిదిన ( కూడల సంగమనందు శరణమేళము ) జనవరి 14
2. సిద్ధరామేశ్వర జయంతి జనవరి 14
౩. గణరాజ్యోత్సవ జనవరి 26
4. చన్నబసవేశ్వర లింగైక్యదిన మాఘ పౌర్ణిమా
5. సర్వశరణుల దినాచరణ మహాశివరాత్రీ
6. అల్లమప్రభూ జయంతి యుగాది, చైత్ర ప్రతిపదా
7. అక్కమహాదేవీ జయంతి చైత్ర పౌర్ణిమా
8. ధర్మగురు బసవ జయంతి వైశాఖమాస అక్షయతృతియా
9. మడివాళ మాచిదేవ జయంతి మరియు కాయక దినాచరణ మే 1
10. ధర్మగురు బసవ పంచమీ-బసవ లింగైక్యదిన శ్రావణ శుధ్ద పంచమీ
11. నీలమ్మా షష్ఠీ-నీలాంబిక లింగైక్య దినాచరణ శ్రావణ శుధ్ద షష్ఠీ
12. స్వాతంత్ర్య దినోత్సవం ఒగస్ట 15
1౩. కల్యాణ క్రాంతి - హరళయ్యా మధువరస సంస్మరణ దిన మహానవమీ
14. బసవ ధర్మ విజయోత్సవ మరియు అక్క నాగలాంబికా సంస్మరణ దిన విజయాదశమీ
15. చన్నబసవ జయంతి కార్తిక శుధ్ద ప్రతిపదా

ముఖ్యమైన కొన్ని జయంతులనగా యుగాది రొజు వచ్చు అల్లమ ప్రభుదేవర జయంతి, చైత్రమాసపు దవనద పున్నమనాడువచ్చు హరళయ్య మధువరసర మరణవే మహానవమి పండుగ, దీపావళి పాడ్యమినాడు వచ్చు చెన్నబసవ జయంతి, శివరాత్రిని సర్వశరణుల దినాచరణమగా ఆచరింపవలెను. బసవజయంతిని మాత్రము వైశిష్యపూర్ణముగా సార్వత్రికముగ ఆచరింపవలెను. అనుకూలమున్నచో అదే పద్ధతిని అన్ని జయంతులయందునూ అనుసరింపవచ్చును. లేకున్న ఆయా శరణుల వచనములను ఆనాడు పటించి పండుగ భోజనము చేసి ముగింపవచ్చును. ఇప్పుడు కొన్ని పండుగలను రాక్షుసుల వేరిటనో దేవతుల వేరిటనో ఆచరించుచున్నారు గదా. వానిని శరణుల జయంతులనగా మార్పు చేసినచో దానికి ఘనమైన అర్థవ్యాప్తి దొరకును.

ధర్మగురు బసవ జయంతి

లింగాయత ధర్మపురుషుని హృదయ స్వరూపులైన బసవణ్ణగారి జయంతి లింగాయతులందరికి సర్వ శ్రేష్ఠమైన పండుగ. అది మనుకులమునకు స్వాతంత్ర్యము కలిగించు మహాపురుషునకు జన్మమిచ్చినది. ప్రతి సంవత్సరమూ వైశాఖ శుద్ద అక్షయ తృతీయయందు ఈ పండుగ వచ్చును. ఆనాడు లింగాయుతలందరూ ఇంటియుందు తప్పనిసరిగా , స్నానపూజాదులను చేసి, వచనశాస్త్ర పారాయణము చేయవలెను. స్తితిమంతులు, వ్యాపారస్తులు, అనుకాలమున్నవారు తమతమ యొగ్యతానుసారముగ వచనముల వందల (నూరారు) ప్రతులను ప్రకటించి లోకగుని పంచవలెను. స్త్రీలు తమ స్నేహితురాంటును ఇంటికి ఆహ్వానించి టెంకాయ, అరటిపండ్లు ఇత్యాది వస్తువులను ఇచ్చుటకు బదులుగా చిన్న వచన పుస్తకం (పత్రం) పంచవలెను. వ్యాపారస్తులు తమ అంగడులయందు బసవణ్ణగారి పెద్ద భావచిత్రమును అలంకరించిపెట్టి పూజించి సహోద్యోగులను ఆహ్వానించి వచనగ్రంథములను పంచవలెను. ఆనాడు అంగడి వ్యాపారమును నిలిపి దీనదరిద్రులకు చేతనైనంత సహాయము చేసి, వైద్యులు ఆనాడు ఉచిత చికిత్సను ఇచ్చి సేవాభావమును ప్రకటింపవలెను. పెద్ద ప్రమాణమునందు బసవజయంతియొక్క ఉత్సవములను ఏర్పాడు. చేసి దానియందు భాగమువహింపవలెను. నేను శ్రీమంతుడను, పెద్ద అధికారిని, విద్యావంతుడను అను గర్వము తెచ్చుకొనక కింకరుడై భాగము వహించి గురుభక్తిని, సమాజ సంఘటనా ప్రజ్ఞను ప్రకటింపవలెను. మనకై ఒక ఘనమైన ధర్మమునిచ్చి మనుకులముయొక్క సర్వవిధ స్వాతంత్రమునకు పోరాడిన బసవణ్ణకు ఇంతటి కృతజ్ఞతను చూపక పోయినచో మనము కృతజ్ఞత లేనివాళ్ళు అని చెప్పవచ్చును.

ధర్మగురు బసవ లింగైక్య దినాచరణము

విశ్వగురు, మంత్రపురుష, మహానుభావి, ముక్తిదాయక, బసవణ్ణగారు లింగైక్యము చెందినది. శ్రావణ శుద్ధ పంచమినాడు. కూడలసంగమ గురుకులమునందు ఇష్టలింగ పూజామగ్నులైన బసవణ్ణగారి “తావు బంద మణిహ పూరయిసిత్తు శివనట్టిద బెసను సందిత్తు” అని తెలిసి ఇహలోక వ్యవహారమునకు మంగళము పాడదలచిరి. ప్రాణలింగి స్థితిని పొంది కాయజీవము కుట్టును విచ్చుకొని పరమహంసులైన ఆ బసవణ్ణగారు దేహమును విసర్జించి తమ పరిశుద్దాత్మను పరమాత్మయందు విలీనము చేసి కరగిన కర్పూరమైరి. సముద్రమునందు చేరిన నదినంటవార్తెరి.

బసవజయంతిని ఉత్సవ ప్రధానమూగ ఆచరించిన బసవ పంచమిని వ్రత ప్రధానముగ అచిరింపవలెను. శ్రావణ మాసపు అమావాస్య మరుదినమునుండి బసవేశ్వర పూజా వ్రతమును ఆరంభింపవలెను. పంచమినాటికి ఐదవ వ్రతము ముగియును. పంచమినాడు పూజామంగళమును చేసి ప్రసాద వితరణము చేయవలెను.

సామూహికముగ చెయవలసిన ఐదుదినములు వ్రతము చేసి బసవ పంచమినాడు అందరూచేరి సామూహికముగ ప్రసాద దాసోహమును చేయవచ్చును.

సూచిక (index)
Previous శరణమేళము - బసవక్రాంతి దినము లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్య Next