Previous లింగాన్ని తెలియనివాడు శ్రీ శివకుమార స్వామి Next

చేతుల్లో లింగపూజ చేస్తూ మనసులో సంసార గుంజాటనపడ్డూ

- మడపతీ.V. V, జహీరాబాద్.

మోళిగే మారయ్య గారి వచనము

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||

చేతుల్లో లింగపూజ చేస్తూ
మనసులో సంసార గుంజాటనపడ్డూ
ఇదెక్కడి లింగపూజ
ఇదెక్కడి జంగమపూజ
ఇలాంటి సిగ్గులేని ముక్కు తెగినవారిని జూపవద్దురా
నిఃకళంక మల్లికార్జునా. - సమగ్ర వచన సంపుటం : 1 వచనము సంఖ్య : 1660

నాడు 12 వ శతాబ్దంలో కాశ్మీర్ ప్రాంతం రాజైన మహాదేవ భూపాలుడు బసవేశ్వరుని లింగవంత ధర్మానికి ఆకర్శితుడై కల్యాణ రాజ్యానికి వచ్చి లింగధర్మాన్ని స్వీకరించి, కట్టెలు మోసే కాయకం చేస్తూ, కన్నడం నేర్చుకొని ఎన్నో అద్భుతమైన వచనాలను రాయడం జరిగింది. ఆయన రాసిందే ఈ వచనము. ఈ వచనములో లింగవంతుల ఏకదేవోపాసన గురించి చాలా మార్మికంగా వివరించడం జరిగింది.

చేతుల్లో లింగపూజ చేస్తూ మనసులో సంసార గుంజాటనపడ్డూ

ఇష్టలింగాన్ని ధరించిన పిదప అంతరంగమందు మరియూ బహిరంగమందు సమానమైన దృష్టితో ఇష్టలింగాన్ని ఆరాధించాలి. అంతే కాని, ఒక చేతిలో ఇష్టలింగాన్ని ఆరాధిస్తూ మనస్సులో సంసారం గురించి ఆలోచిస్తూ , డాంబిక పూజలను ఆచరిస్తే అది నిజమైన భక్తుల లక్షణం కాదని చెప్పడం జరిగింది. మనస్సు ఏకీకృతం కావాలంటే అంతరంగపు ఆచారం బహిరంగ క్రియ సమదృష్టితో ఉండవలెనే కాని తద్విరుధ్ధంగా ఉండరాదు. అంటువంటి వారల అంతరంగ పూజయైన, లింగ పూజ ఎటువంటిదో..? అటువంటి వారల బహిరంగ పూజయైన జంగమ పూజ ఎటువంటిదో..? అంతరంగ , బహిరంగ శుద్దిలేని పూజ ఎన్నిరోజులు చేసినా ఏమి ఉపయోగమనే ప్రశ్నను వేశారు మోళిగె మారయ్య గారు.

ఏకదేవోపాసన కలిగిన ఇష్టలింగాన్ని ఇష్టముతో‌ పూజించక కష్టంగా పూజిస్తూ ఆచారాన్ని అనాచారముగా చేసి అంతరంగం బహిరంగం పరిశుధ్ధంగా లేనివారల ముఖమును ఎప్పుడూ చూపించకని నిఃకలంకమల్లికార్జున్ని మోళిగె మారయ్య గారు వేడుకోవడం జరిగింది.

బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి

అందరికీ అనంత శరణు శరణార్థులు.

*
సూచిక (index)
Previous లింగాన్ని తెలియనివాడు శ్రీ శివకుమార స్వామి Next