పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి | ఇష్టలింగము |
లింగాయత ధర్మగురువు |
ఒక విశిష్టమయిన సిద్ధాంతము, సాధన, ధర్మగురువు మున్నగు ఏకాదశ సూత్రములను పొంది ఒక గురువును ప్రధానిగా పొందినదె సుధారణా ధర్మము. ఒక గురువునుండి ప్రారంభముకాక నైసర్గికముగ పెరిగి వచ్చినది నైసర్గిక ధర్మము. నైసర్గిక ధర్మము అనేక ఆచరణలు, అనేక సిద్ధాంతములు, ఇట్లన్నంటిని లోగోన్నది. అందు మారమ్మ, దుర్గమ్మల పూజ మొదులుకొని "అహం బ్రహ్మాస్మి" అను సూక్ష్మ సిద్ధాంతమువరకు అవకాశము కలదు. సుధారణా ధర్మమునందు దీనికి అవకాశము లేదు, ఒకే విధమైన సిద్ధాంతము, ఒకే విధమైన దర్శనము - ఇట్టి సుధారణాత్మక లింగాయత ధర్మమును ప్రసాదించిన మహాపురుషుడు బసవణ్ణ.
`"స్థావరలింగ పూజేయ మాణిసి
కరక్కె కంకణవ కట్టి నిర్ధారద తాళెయ కంఠదల్లి కట్టి
కలియాగు" ఎందు కృతార్థన మాడిద
కూడల చెన్నసంగయ్య, నిమ్మ శరణ సంగన బసవణ్ణన
శ్రీ పాదక్కె నమో నమో -- (చ.బ.వ. 652)
పరంపరాగతముగ వచ్చియుండిన అనేక ఆచరణలను తిరస్కరించి ఒక క్రొత్త విధమైన భక్తిని ఆరంభించినవారు
బసవణ్ణగారు. కావుననేవారిని "ప్రథమాచార్య నీనె, లింగాచార్య నీనె" అని చెన్న బసవణ్ణగారు
పిలిచియున్నారు (28).
"ప్రాణలింగద లాంఛనద ప్రసాదద పూర్వాశ్రయ కళెయలిక్కాగియే మహా గురువాగి బసవణ్ణ అవతరిసిద"
అని వారి అభిప్రాయము (చ.బ.వ.27) కావున విశ్వధర్మలక్షణములను కలిగిన లింగాయత ధర్మముయొక్క
ఘటనావళి () నిర్మాపకులు మహాత్మా బసవణ్ణగారు. వారె లింగాయత ధర్మముయొక్క ఆదిగురువు.
1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.
*పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి | ఇష్టలింగము |