Previous లింగాయత ధర్మగురువు హిందుమతము నుండి ఆవిర్భవించిన మతములు - ధర్మములు Next

ఇష్టలింగము

Ishtalinga

అష్టావరణములందు అత్యంత వైశిష్టపూర్ణమైన లాంఛనమనగా ఇష్టలింగము. నిరాకారుడైన దేవుని మనుష్యుల, ప్రాణుల ఆకారమునందు కల్పింపక విశ్వమయొక్క ఆకారమునందు రూపించి ఇష్టలింగముగచేసి ఇచ్చిన మహాగురువులు బసవణ్ణగారు. జగత్తునందు ఏ ఇతర ధర్మములందునూ లేని, దేవుని విశ్వాకారమునందు తాత్వికముక రూపింపచేసి పూజించునట్టి గొప్పతనమును ఇందు చూడవచ్చును. నిరాకారమును సాకారరూపముల మూలకముగ గ్రహించునట్టి పద్ధతి ఆధ్యాత్మికముగనూ వ్యవహరికముగనూ ప్రపంచమునకలదు. నిరాకారమైన కాలమును తెలిసికొనుటకు సాకారమైన గడియారము సాధనమగునట్లు నిరాకార పరమాత్మను తెలిసికొనుటకు ఇష్టలింగము సాకార చిహ్నము. ఇది ఏ ఒక్క వ్యక్తియొక్క మూర్తికాదు. ప్రాణియొక్క మూర్తియొకాదు. దేవాలయము లింగమువలె పౌరాణిక శివుని సంకేతపరచునదియూ కాదు. జగత్తంతయూ నిండుకొనియున్న పరమాత్మయొక్క శరీరమైన బ్రహ్మాండము గోళాకారమునందుటవలన ఆకారమునందు రూపింప చేసికొన్న గురుతు. దీనికి సామాజిక, యోగిక, ఆధ్యాత్మికతల అర్థవ్యాప్తియున్నది ఇది ఎక్కువ తక్కువలను. సూతకమును పోగోట్టునట్టి సాధనము. బ్రాహ్మణుడు లింగధారకుడైనచో తాను మేలివాడు అను గొప్పతనమును అంత్యజుడు లింగధారకుడైనచో తాను తక్కువవాడను హీనభావనమును విడిచి పెట్టవలియుండును. అప్పడు ఇద్దరియందును సమానత స్థాపితమగుచున్నది.

*

ఇష్టలింగమునకు నల్లని కాంతియుక్తమైన వస్త్రకవచము వుండుకారణమున అది దృష్టియోగము మరియు త్రాటకయొగమందు సహాయక సాధనమగును. కంటినలుపు ఇష్టలింగ నలుపు పరస్పరము ఆకర్షింపగ వెంటనే చిత్త ఏకాగ్రతయొక్క అనుభవమగును.

ఆధ్యాత్మికముగ ఇది భవసాగరమును దాటించుపడవవంటిది. ఆవుపొదుగనదుండు పాలయందు నేయియుండుట సత్యాంశము. ఒకవేళ ఆవు క్రింద పడి దెబ్బ తగిలినచొ వేడి నీతిని రుద్దుడు అని వైద్యుడు చెప్పును. అప్పుడు పాదువునందు పాలున్నది, పాలయందు నెయ్యయున్నది అని జపము చేసిన నొప్పి పోదు. లోపలనున్న పాలును బయటికి తీసి సంస్కరించి నేతిని తయారుచేసి రుద్దిననే కదా నొప్పి మాయమగను. ఆ విధముగ మానవుని లోపలనుండు ఆత్మచైతన్యము నేరుగా భవమున పోగోట్ట నేరదు. దీనిని తెలిసికొన్న శ్రీ గురువు అంతరంగములోని ఆత్మచైతన్యమును సులభముగ బయటికి తీసి ఉద్భవలింగముగ రూపింప చేసి బ్రహ్మాండ గతమైన మహా చైతన్యమును గోళాకారపు చిహ్నముగ రూపించి రెండిటిన అభిన్నముగ చేసి శిష్యునకు ధారణ చేయును. ఈ కరస్థలమునందలి జ్యోతి జ్ఞాన చిహ్నము మరల అంతరంగమును ప్రవేశించి కాయ(దేహం)మునే కైలాసముగచేసి పవిత్రము చేయును (బ.ష.హ.వ 1360)
అట్లే శ్రీ షణ్ముఖస్వాములు "ఇష్టలింగము తనకంటె భిన్నమైన వస్తువుయొక్క మూర్తిపూజకాదు. జీవాత్మ పరమాత్మలను ఏకము చేసి పూజించునట్టి అహంగ్రొహోపాసన అని చెప్పుదురు.

ఎన్న కరస్థలద మధ్యదల్లి పరమ నిరంజనద
కురుహుతోరిద, ఆ కురుహిన మధ్యదల్లి
అరుహిన కళెయ తోరిద;
ఆ కళెయ మధ్యదల్లి మహాజ్ఞానద బెళగ తోరిద
ఆ బెళగిన నిలువినొళగె ఎన్న తోరిద
ఎన్నొళగె తన్న తోరిద. తన్నోళగె ఎన్ననింబిట్టుకొండ
మహాగురువిగె నమో నమ: ఎనుతిర్పెనయ్యా
అఖండేశ్వరా!

కొందరు ఇష్టలింగ పూజనుకూడ స్థావరలింగ పూజయని అందురు. కాని శరణులు దీనిని ఒప్పుకొనరు.

పరబొమ్మవె శరణన శిరదరమనెయింద కరదర మనెగె
గురుకృపెయింద లింగమూర్తియాగి బిజయం
గైదిర్పుదు కండా!
అదు కారణ శరణంగెయూ లింగక్కెయో బేదా
భేద సంబంధవిప్పుదు కండా!
ఈ గోత్తనరియదె యుక్తిగెట్ట మనుజరు
లింగవు కైలాసద శివన కురుహాదుదరింద పూజ్యవెంబరు;
శరణు మనుజనాదుదరింద అవను పూజకనెంబరు
ఇంతి కేవల భేదసంబంధవ కల్పిసువ భవభారిగళు
శివాద్వైతక్కె దూరవాగిప్పరు కండా
అరెయరివిని నరజీవగళు శరణర సామరస్యక్కె
హొరగాగిర్పరు కండా
కూడల చెన్నసంగమదేవా (చ.బ.వ.1176)

లింగవంతలు ధరించి పూజించు ఇష్టలింగము పౌరాణిక శివుని ప్రతీకముకాదు. "శిరదరమనెయల్లి నెలెసిరువ పరబొమ్మద ప్రతీక" అనునది శరణుల వాణి.

ఇట్లు అత్యున్నతమైన తత్వముగల ఇష్టలింగమును ప్రతియొక్క అనుయాయియూ తప్పక ధరింపవలెను. ఎందుకనగా దేవునికి అర్పింపక ఆతడు ఏమియూ తినరాదు. జగత్తంతయూ దైవీవరము. దానిని ఉదారముగ దానముగ దేవుడు మనకు ఇచ్చియుండగ ఆతనకి కృతజ్ఞతచూపక భోగించుట కృతఘ్న కార్యము. కావున ప్రతియొకదానిని మనము అనుభవించుటకు ముందే దానిని సాంకేతికముగ దేవునికి అర్పించి స్వీకరింపవలెను. ఇట్లు అర్పించు కార్యమే పూజ. దీని అంగముగ నిత్యలింగార్చన చేసి దినమున మొదటి ప్రసాదముగ ఇష్టలింగ తీర్థమును, ఇష్టలింగ ప్రసాదమును స్వీకరించి జీవనమునకు దివ్యతను తెచ్చుకొనవలెను.

అంగముపైగల లింగమునవచ్చు సుఖమెవ్వరికి నివేదింతు?
భక్తిపతమునకుచెల్లదు కాన లింగమున విడరాదు;
శరణుపథమునకు చెల్లదు కాన విడరాదు
సంగని విడిచి మ్రింగిన యెంగిలి మంగలమై పోవురా! (బ.ష.వ.732)

దీనిని తెలిసికొని నిత్యలింగార్చనను చేయువాడే లింగాయతుడు. సర్వులు లింగార్చనను చేయవలెనన్నవారు తమ తమ ఇష్టలింగములను ధరించియేయుండవలెను కదా? ధర్మాచరణములు శిథిలమైనప్పుడు జనులు లింగధారణమయొక్క మహాత్యమును తెలియక ధరించుటను విడిచిపెట్టుదురు. ఏమొ అంతటి ప్రసంగము కలిగినప్పుడు భార్య-భర్త-బిడ్డలు పరస్పరము మార్చుకొని పూజింతురు. గురువు చిత్కళను నింపియిచ్చిన వస్తవును శరీరమునుండి తీసివైచి వేర్వేరు జనులు అట్లు పూజింపరాదు. దానిని చెన్నబసవణ్ణగారు ఇట్లు విమర్శించుచున్నారు.

సతియ కైయ్యల్లి కొట్టుదు ప్రాణలింగవల్ల;
సుతన కైయ్యల్లి కొట్టుదు ప్రాణలింగవల్ల;
అలసి నాగవత్తిగెయలిరిసుదుదు ప్రాణలింగవల్ల;
తనుసోంకి వజ్రలేపదంతిరబేకు
మనదల్లి కరదల్లి కొట్ట ప్రాణలింగ హింగిదడె
అవనందే వ్రతగేడి, కూడల చెన్నసంగమదేవా (చ.బ.వ. 854)
గురువాసంగిన ఇష్టలింగమును తొలగించిన దానియందలి చిత్కళ పతనమగును. గురుకారుణ్యము ఇష్టలింగముందు ప్రసరించి ఎల్లగాలము, శిష్యుని రక్షించును. కావున ప్రతియొక్కడు దానిని ధరించి పూజింపవలెను.

ఒమ్మె నెలదల్లి బిత్తిద బిత్తువ (బీజవ) కిత్తి కిత్తి
మత్తె బిత్తుత్త హోదరె
ఆ బిత్తు మొళెతు కళెయేరి బెళెదు
బెళసన్నీవ పరియంతో, మరుళు మానవా!
గురువిత్త లింగవ తొరెతొరెదు మరళి
మరళి ధరిసిదడె ఆ ఇష్టలింగవు అనిష్టవ
కళెదు ఇష్టార్థవనీవ పరియిన్నెంతో!
ఇదు కారణ కూడల చెన్నసంగయ్యనల్లి ముక్తియనరసువొడె
అంగదల్లి హెరెహింగదె లింగవ ధరిసబేకు (చ.బ.వ. 138).

*

Reference:

1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous లింగాయత ధర్మగురువు హిందుమతము నుండి ఆవిర్భవించిన మతములు - ధర్మములు Next