Previous లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్య లింగాయతలు లింగవంతలు Next

లింగాయతుడు ఎవరు?

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

లింగాయతుడు ఎవరు? (12 సూత్రుల ప్రతిజ్జావిధి)

1. సమతావాది, మనుకులోద్ధారి, విశ్వగురు బసవణ్ణగారిని లింగాయత ధర్మపు ఆదిగురువని, మంత్రపురుషుడని తెలిసి ధర్మపిత బసవణ్ణగారే తన రక్షకుడు, మొక్తిదాయక గురువు అని నమ్మి వారి శ్రీ చరణమునకు శరణగువాడే లింగాయతుడు.

2. జగద్గురు బసవణ్ణగారే ఆదిప్రమతులై బసవయుగముయొక్కయు బసవపథముయొక్కయు శరణులు ఇచ్చిన వచన సాహిత్యమునే తన ధర్మసంహిత (ధార్మిక సంవిధానము) అని నమ్మి వచనశాస్త్రముయొక్క అధ్యయన, పారాయణ, అనుష్టానములను చేయువాడే లింగాయతుడు.

3. చేతనాచేతనాత్మకమైన విశ్వముయొక్క సృష్టిస్థితి-లయమునకు కారణకర్తయైయుండు పరమాత్ముని అస్తిత్వమునందు నమ్మకముంచి, ఆ దేవుని గోళాకారమునందు (చుళుకు) ముడుగుగావించియిచ్చిన బసవణ్ణగారి కానుకయైన ఇష్టలింగమునందు శ్రద్దయుంచి దేహముపై ధరించుకొని పూజించునతడు లింగాయతుడు.

4. బసవాది ప్రమథులు, ఈ పరంపరయందు సాగివచ్చియుండు శివయోగులు - శరణులు మున్నగువారి తపోభూమి - ఐక్యస్తానములను తనధర్మపు పవిత్ర క్షేత్రములని పరిగణించి, ధర్మపిత బసవణ్ణగారు ఐక్యముపోందిన కూడలసంగమమును ధర్మక్షేత్రమని నమ్మి, దాని సర్వాంగీణ ప్రగతికి పాటు పడుటయే కాక, ఎక్కడ వెలసియున్నను ఈ ధర్మభూమియొక్క సందర్శనము తన జీవనముయొక్క పవిత్ర కర్తవ్యమని భావించునతడే లింగాయతుడు.

5. “బసవుని మూర్తియే ధ్యానమునకు మూలము” అను శ్రీ శివయోగి సిద్దరామేశ్వరుల వాణి మేరకు ఇంటియుదు సభాసమారంభములయందు, మఠమాన్యములందు బసవగురువుయొక్క భావచిత్రమును, బసవగురు మూర్తిని ఉంచి, వారి తత్వములను పాలించు ఏక గురునిష్ఠకలవాడై, బసవ జయంతి, బసవలింగైక్య దినాచరణము (శ్రావణ శుద్ధ పంచమినాడు), బసవక్రాంతి దినాచరణము (సంక్రాంతినాడు) - వీనిని తప్పక చేయునతడు లింగాయతుడు. దేవమంత్రమని “ఓం లింగాయ నమ:” అను షడక్షరి మంత్రమును, గురు మంత్రమని “ఓం శ్రీ గురుబసవలింగాయ నమ:” అను ద్వాదశాక్షర మంత్రమును శ్రద్ధతో గౌరవించి, పఠించువాడు లింగాయతుడు.

6. విశేష ధార్మిక ఉత్సవములందు, శరణుల జయంతులయందు షట్ స్థలధ్వజమును ఎగురవేయుటయే కాక, తమ ఇండ్లపైనను, మఠములవైనను షట్కోణ లాంఛనమును వేసి, ఇండ్లకు బసవాది శరణుల వేరు పెట్టునతడే లింగాయతుడు.

7. పుట్టినప్పుడు లింగధారణము, తారుణ్య (14-29) వయస్సునందు ఆడ - మగ భేధము లెక్కింపక లింగదీక్షా సంస్కారమును సద్గురువునుండి బిడ్డలకు ఇప్పించువాడే (తానును చేయించుకొన్నవాడే) లింగాయతుడు. చిన్నబిడ్డల దేహముమిద ఇష్టలింగమును కాని, బసవగురువు పదకమునుగాని తప్పక ధరింపచేయువాడే లింగాయతుడు.

8. లింగాంగులను ధర్మబంధువులని భావించి, వారివిషయమున జాతిభేదములను లెక్కింపక, భోజనము, వివాహ సంబంధములను నిస్సంశయపూర్వకముగ చేయనతడే లింగాయతుడు. భక్తత్వ, గురుత్వ, జంగమత్వములు జన్మతో వచ్చు జాతిసూచక పదములు కావు, క్రమముగా సదాచార - సుజ్ఞాన స్వానుభవములతో సంపాదించిన అర్హతలని నమ్మునతడే లింగాయతుడు.

9. అష్టావరణములైన గురు - లింగ - జంగములు (పూజ్య వస్తువులు) విభూతి - రుద్రాక్షీ - మంత్రములు (పూజా సాధనములు), పాదోదక - ప్రసాదములు (పూజాఫలములు) అనునవి లింగాయత ధర్మపురుషుని అంగమని, పంచాచారములైన లింగాచార - సదాచార - శివాచార - గణాచార - భృత్యాచారములు ధర్మపురుషుని పంచప్రాణములనియు, షట్ స్థలముయొక్క వివిధ మెట్టులగు భక్త, మహేశ, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్యములనునవి ధర్మపురుషుని ఆత్మయని తెలిసి ఆచరించువాడే లింగాయతుడు.

10. బహుదేవతోపాసనకు కారణమగు గుడిగోపురములను నిర్మింపక దేహమునే దేవాలయము చేసుకొను సదాచారమును అలవాటు చేసుకొని ధర్మమునకు ఆద్యుడైన బసవగురువును చైతన్యస్వరూపులైన గురుజంగములను (అర్థాత్ జ్ఞానులను) గౌరవించి బసవణ్ణగారు సూత్రరూపముగ నిర్మించి చూపిన అనుభవ మంటపముయొక్కమాదిరిగా ఆధ్యాత్మిక కేంద్రములను నగరములు, గ్రామములు, పల్లెలు వీనియందు నిర్మించి వానికి బసవమంటపములను వేరువేట్టి వాని మూలకముగ సామూహిక ప్రార్థన, ధర్మబోధ, వచనశాస్త్ర అధ్యయన, ప్రవచనములు నడపువాడు, పాల్గొనువాడు లింగాయతుడు.

11. యజ్ఞయాగాములు, హోమహవనాదులు చేయక పంచసూతకములైన జనన సూతకము, మరణ సూతకము, జాతిసూతకము, ఉచ్చిష్టసూతకము, రజస్సూతకములను ఆచరింపక చతుర్వర్ణాత్మక వ్యవస్థ దేవనిర్మితముకాదు. మానవ కల్పితమని తెలిసి జాతిభేధ పద్దతిని, అస్పృశ్యతలను నిరాకరించి సమాజమునందు ప్రతియొక్కని పెరుగుదలకు సమానావకాశమునిచ్చు సమతావాదియూ, విచారశీలుడునై మాంసాహారికాక శుద్ద సస్యాహారియై జీవనము గడపు అహింసావాదీయే లింగాయతుడు.

12. “నిరాకార దేవన ముఖ సమాజ” “దయవే ధర్మద మూల” అని తెలిసి అపారమైన మానవీయత - ప్రీతితో దీన దుఃఖితులను, పాపిపతితులను దయతో వారి ఉన్నతికి శ్రమించి బసవాది శరణులు జాతి - వర్ణ - వర్గ రహిత కల్యాణ రాజ్యమును మర్త్యలోకమునందు నిర్మాణము చేయుటకు ఏ ఉదాత్త ధ్యేయముతో శ్రమించి ఆ ధ్యేయమునకు తనను తాను సమర్పించుకొని సకల జీవాత్ములకు శ్రేయస్సును కోరు. మానవతావాది, విశ్వధర్మియే లింగాయతుడు.

బసవ లింగాయత ధర్మముయొక్క షట్ సూత్రములు.

ధర్మ గురువు - విశ్వగురువు బసవణ్ణగారు
ధర్మ సంహిత - సమానతను చెప్పు వచన సాహిత్యము.
ధర్మ లాంఛనము - విశ్వాత్ముని చిహ్నమైన ఇష్టలింగము.
ధర్మ క్షేత్రము - బసవణ్ణగారి ఐక్యక్షేత్రమైన కూడలసంగమము.
ధర్మ ధ్వజము . - ఇష్టలింగ, షట్కోణసహితమైన బసవధ్వజము.
ధర్మ ధ్యేయము - జాతి - వర్ణ - వర్గరహిత, ధర్మ సహిత కల్యాణ రాజ్య నిర్మాణము.

బసవ లింగాయత ధర్మానుయాయుల ప్రతిజ్జూనిధి. పన్నెండు ప్రతిజ్ఞలు. (Twelve Oaths)

ఓం శ్రీ గురు బసవలింగాయనమః

ధర్మగురువు బసవణ్ణగారి సాక్షిగా, జగత్కర్త పరమాత్ముని సాక్షిగా, సర్వశరణుల సాక్షిగా నేనిపుడు ప్రతిజ్ఞనుగైకొనుచున్నాను,

శ్రీ గురు బసవనిగే శరణాగిహె
లింగదేవనిగె శరణాగిహె
శరణగణక్కె శరణాగిహె
గణపదవియన్నుకోనెను హోందినాను.

ఓం 1. జగత్తును నిర్మించిన సృష్టికర్తయొక్క అస్తిత్వమునందు నమ్మకముకలిగియుందును. ఆతడొక్కడే మరియు పరమోన్నతశక్తియని నమ్మెదను.

శ్రీ 2. విశ్వగురు బసవణ్ణగారు దేవుడు లోకోద్దారమునకై పంపించిన ప్రతినిధి, కారణికుడు, దేవుని కరుణలోది బిడ్డడు, మనందరి రక్షకుడు, మొక్షదాయకుడుయని తెలిసికొనెదను.

గు 3. గురు బసవణ్ణవారే ఆదిప్రమథుడౌ, ఆతని సమకాలీనులు మరియు వారి పరంపరయొక్కశరణులు ఇచ్చిన వచనసాహిత్యమునే నాయొక్క ధర్మ సంహితయని తెలిసికొని శరణపథమునందు నడచెదను.

రు 4, ధర్మపిత బసవణ్ణగారు విశ్వదాకారమునందు రూపించి ఇచ్చిన విశ్వాత్ముని గురుతగు ఇష్టలింగమును శ్రద్ధతో ధరించి, నిష్టతో నిత్యమూ పూజింతును.

5. ధర్మపిత బసవణ్ణాగారు. బయలైన దివ్యక్షేత్రము కూడలసంగమమును మా ధర్మక్షేత్రమని నమ్మి సందర్శించెదను.

6. ఏడుదినముల వారమునందు ఒకదినమందైననూ శరణుల సంగమునందు చేరి కర్తను స్మరించి, ధర్మపితను కోనియాడి గణమేళ అనుభవ గోష్ఠియందు భాగము వహించెదను. మహాశివరాత్రియందు నడచు వార్షిక గణమేళకు తప్పకుండ భాగవంచేదెను.

7. సత్యశుద్ధకాయకమునుండి ధనమును సంపాదించి దాసోహతత్వ మూలకముగా ధర్మసమిష్ఠుల ఉద్ధారమునకై వినియోగించెదను.

లిం 8. విశ్వగురు బసవణ్ణవారి విద్యాభూమి, తపోస్థానము, ఐక్యక్షేత్రము కూడలసంగమమునందు ప్రతి సంవత్సరమూ బసవక్రాంతిదినమందు నడచు - శరణమేళకు వచ్చెదను. జీవనపయణములో ఒకసారియైనా ఎంతోని అననుకూలతయున్ననూ వచ్చి భాగమువహించి, నాయొక్క ధార్మిక అనూయాయిత్వమును స్వీకరించెదను.

గా 9. పరధనము - పరస్త్రీలను కోరను.

10. మాంసాహారమును చేయను, మద్యపానమును ముట్టను.

11. స్వధర్మీయులను ధర్మబంధువులని, పరధర్మీయులను స్నేహితులని భావించి ఆదరించెదను.

మ: 12. ధర్మ పితయొక్క సంకల్ప ప్రకారముగా మర్త్యలోకపు ఆ కర్తయొక్క కర్మాగారమునందు, జాతి, వర్ణ, వర్గరహిత ధర్మసహిత కల్యాణ దైవీ రాజ్యపు నిర్మాణమునకై నిష్ఠతో ప్రయత్నము చేసెదను.

- జయ గురు బసవేశ హరహర మహాదేవ -

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన - పూజ్య శ్రీ జగదురు మాతే మహాదేవి, కూడలసంగమము అనువాదము - విశ్వలింగాయత్ పరిషద్ (రి) సౌజన్యముతో
ప్రకాశకులు : బసవధర్మపు మహా జగద్గురు పీఠము, మహామనే మహామఠ, కూడల సంగమము,
హునగుంద తాలూకు, బిజాపుర జిల్లా - 587115

సూచిక (index)
Previous లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్య లింగాయతలు లింగవంతలు Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys