అష్టమి నవమి అనే కల్పనలు లింగధారికి ఉండరాదు
|
|
- మడపతీ.V. V, జహీరాబాద్.
లింగాయత ధర్మగురు బసవేశ్వరుని వచనము
|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||
"అష్టమి నవముల కల్పనలు ఎందుకో శరణునకు ?
తప్పును గణపదవి : దూరమై పోవు లింగజంగములకు !
ఒకనికి భటుడై ఇంకొకని సేవించు బుధ్ది లేని మనుజులను ఏమందునయ్యా
కూడలసంగమదేవా !"
సమగ్ర వచన సంపుటం : 1
వచనము సంఖ్య : 619
ఇష్టలింగాన్ని ధరించిన లింగవంతునికి అష్టమీ, నవమి, పూర్ణిమా, అమావాస్య అనే తారతమ్యం ఉండకూడదని బసవణ్ణ గారు తన వచనములో చెప్పడం జరిగింది.
"అష్టమి నవముల కల్పనలు ఎందుకో శరణునకు ?"
ఒకసారి శరణపరంపరలో ఇష్టలింగధారియైన శరణునికి మంచి (నవమి) సమయము చెడు (అష్టమి) సమయాలు వంటివి ఆచరించరాదు. ఎందుకంటే శరణుడి ప్రతీ ఉచ్ఛ్వాస - నిచ్ఛ్వాసలు మంచివే ప్రాణం ఉన్నంత వరకు ఎల్లప్పుడూ శివుని ధ్యానములోనే ఉండవలనే తప్ప మంచి సమయం చెడు సమయం అని చూడరాదు.
తప్పును గణపదవి : దూరమై పోవు లింగజంగములకు !
తప్పును గణపదవి ; గణపదవి అంటే పరమేశ్వరుని మనపై ఉన్న అగ్రగణ్య ప్రాముఖ్యత తప్పుతుంది అని అర్థం. అటువంటి వారికి తాను పూజించే లింగము మరియూ ఆరాధించే జంగమ తత్వము దూరమై పోతుంది అని చెప్పడం జరిగింది.
" ఒకనికి భటుడై ఇంకొకని సేవించు బుధ్ది మనుజులను ఏమందునయ్యా కూడలసంగమదేవా !"
సద్గురువుని చేత ఇష్టిలింగానికి గ్రహించి దానికి భటుటుగా ఉండి, దీనిని సేవించక ఇంకొకరి మాటలు విని అష్టమీ నవమి అంటూ ఇంకొకరికి సేవించే బుద్ధిలేని అజ్ఞాని మానవులను ఏమందునయ్యా అని, బసవేశ్వరుడు తన వచనములో చెప్పడం జరిగింది.
బసవాది శరణుల వచనాలు అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి
బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి
🙏 శరణు శరణార్థి 🙏
*