Previous ఆనందయ్య ఆయ్దక్కి (పరిగబియ్యం) లక్కమ్మ Next

ఆయ్దక్కి (పరిగబియ్యం) మారయ్య

మకుటం: అమరేశ్వర లింగా
కాయకం: వీధిలో పడ్డ బియ్యాని ఏరుకోవడం

*

కాయకంలో నిమగ్నమైనపుడు
గురు దర్శనమైనా మరచిపోవాలి
లింగపూజనైనా మరచిపోవాలి
జంగముడు ఎదుట నిలబడ్డా దాక్షిణ్యం చూపరాదు
ఎందుకంటే కాయకమే కైలాసం కనుక!
అమరేశ్వర లింగమైన కాయకం తరువాతే - ఆయ్దక్కి మారయ్య/1520 [1]

నేమము చేసికొని భక్తుల ఇళ్ళల్లో దూరి,
కాయకం వదలి, ధనం బంగారం వేడడమనేది,
సద్భక్తునికి కష్టం కాదా?
ఆ గుణం అమరేశ్వరలింగానికి దూరం. - ఆయ్దక్కి మారయ్య/1524 [1]

ఆయ్దక్కి (పరిగబియ్యం) మారయ్య: ఈయన స్వస్థలం, రాయచూరు జిల్లాలోని కుష్టిగి తాలూకాకు చెందిన అమరేశ్వరం. భార్య- లక్కమ్మ. అధిదైవం అమరేశ్వరుడే. కాలం క్రి.శ.1160. కల్యాణానికి వచ్చిన ఈతని కాయకం వీధిలో పడ్డ బియ్యాని ఏరుకోవడం (పరిగ ఏరుకోవడమా?) ఇతని కాయకం. కాయక-దాసోహ నిష్ఠగల శరణుల్లో అగ్రగణ్యడు. "కాయకమే కైలాసం" అనేది జీవితానికి సంబంధించి అతిముఖ్యమైన సిద్ధాంతం. "అమరేశ్వర లింగా" ముద్రతో వచనాలను రచించాడు. దొరికిన 32 వచనాల్లో కాయక తత్వ విశ్లేషనే ప్రధానాంశం. భక్తులకు పేదతనముంటుందా? సత్యవంతులకు కర్మ ఉంటుందా
మనస్ఫూర్తిగా సేవ చేసే భక్తునికి
మర్త్యలోకం కైలాసం అనేవికలవా?
అతడున్నదే సుక్షేత్రం
అతని అంగమే అమరేశ్వరలీంగని సాంగత్య సుఖం - ఆయ్దక్కి మారయ్య/1526 [1]

కాణీ పనిచేసి వరహనిమ్మంటే
అది నిజమైన కాయకమయ్యేనా?
భక్తుల చేసినదానికి తక్కువ కొరడమే
అమరేశ్వరలింగానికి చిత్తశుద్ధ కాయకం. - ఆయ్దక్కి మారయ్య/1527 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous ఆనందయ్య ఆయ్దక్కి (పరిగబియ్యం) లక్కమ్మ Next