Previous గుండయ్యగారి పుణ్యస్త్రీ కేతలదేవి జోదర(జోదుల) మాయణ్ణ Next

జేడర(సాలె) దాసిమయ్య

మకుటం రామనాథ
కాయకం: బట్టలు నేయడం

*

కులపంతాలు వదిలి మిమ్మల్ని ప్రేమించే భక్తులకు
తలవంచుతాను కులజలుగా ఒప్పి నేను
చక్కగా దరిచేరి మిమ్ము మెప్పించిన శరణులకు
తలవంచని వాడితల శూలానికి చిక్కిన తల కనుమా రామానాథ! /1739 [1]

జేడర(సాలె) దాసిమయ్య: తొలి (ఆద్య) వచనకారుడు. గుల్బర్గా జిల్లా ముదనూరు ఇతని జన్మస్థలం. తండ్రి కామయ్య. తల్లి శంకరి. భార్య దుగ్గల. కాయకం బట్టలు నేయడం ఆధి దైవతం రామనాథడు. దేవునికి వస్త్రాన్నచ్చి తవనిధి పొందానన్న ఈతని అహంకారాన్ని మరో శరణుడు శంకర దాసిమయ్య అణిచి వేశాడు. ఇతను అత్యుత్తమ శ్రేష్ఠ వచనకారుడు. కాలం క్రి.శ.1100. "రామనాథ" అనే అంకితముద్రతో 176 వచనాలు లభించాయి. వచన సాహిత్య స్వరూపం లక్షణం, ఆశయాలన్ని లోగొన్న ఇవి శరణభాషను కూడ తయారు చెసుకొన్నవి.

సతితోడి పొందును, ఆకలికాహార సేవన,
పృథ్వీ పతి పూజను
తెలివుంటే ఇతరుల చేత చేయించేవారుంటారా రామనాథా! -జేడర దాసిమయ్యా /1772 [1]

భార్య ప్రాణానికి స్తనాలూ, కొప్పూ ఉంటాయా?
పారుని ప్రాణానికి ఉంటుందా యజ్ఞోపవీతం?
ఆఖరున ఉన్న అంత్యజనుని ప్రాణం పట్టి ఉందా పిడికర్ర?
నీవు పెట్టిన అడ్డంకిని ఈ జడులైన లోకులెలా తెలుసుకుంటారు
రామనాథా! - జేడర (సాలె) దాసిమయ్య /1760 [1]

దాసిమయ్య గారి వచనాలు సంక్షిప్తత, సరళత మరియు అర్థయుక్తతలను ముఖ్య లక్షణంగా చేసికొని శరణులు పదజాలాల మహత్వం దాంపత్య ధర్మం, స్త్రీ పురుష సమానత, గురు శ్రుశ్రూష, శ్రేష్ఠత, శరీరపు ఆకలి తీవ్రత, దేవుని దానగుణం, మానవుని స్వార్థం, సమాజ వైరాధ్యాల వైపరీత్యాల విశ్లేషణ, సర్వసమానతా భావనం చాల ఆత్మీయంగా ప్రకటిస్తాయి.

చన్నులూ, జుట్టు పెరిగితే ఆడదంటారు
గడ్డాలు, మీసాలు వస్తే మగాడంటారు
మధ్యన తిరుగాడే ఆత్మ
ఆడకాదు మగకాదు కనుమా రామనాథ! - జేడర (సాలె) దాసిమయ్య /1764 [1]

పతిపతులొకటైన భక్తి హితమైనది దేవునికి
సతిపతులొకటికాని వారి భక్తి
అమృతంలో విషం కలిపినట్టు కనుమా రామనాథా! - జేడర దాసిమయ్యా/1771 [1]

క్రొత్తదొక ధర్మం, క్రొత్త సాహిత్యరూపం, క్రొత్త బ్రదుకు కలలను ఏర్పాటుచేసిన జేడర (సాలె) దాసిమయ్యకు కర్ణాటక ధార్మిక మరియు సాహిత్య క్షేత్రంలో నిండు గౌరవయుత స్థానం ముడుపుకట్టి వుంది.

అసలైన శివైక్యుడికి ప్రొద్దున్నే అమావస్య
మిట్ట మధ్యాహ్నమూ సంక్రాంతే,
మళ్ళి అస్తమయం, పౌర్ణమి, పున్నమి;
భక్తుని ఇంటిముంగెలే వారణాసి కనరా రామనాథా!/ 1714 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous గుండయ్యగారి పుణ్యస్త్రీ కేతలదేవి జోదర(జోదుల) మాయణ్ణ Next