Previous ఆయ్దక్కి (పరిగబియ్యం) మారయ్య ఉరిలింగ పెద్దిగారి పుణ్యస్త్రీ కాళమ్మ Next

ఆయ్దక్కి (పరిగబియ్యం) లక్కమ్మ

మకుటం: మారేశ్వరప్రియ అమరేశ్వరలింగ
కాయకం: వీధిలో పడ్డ బియ్యాని ఏరుకోవడం

*

అంగానికి పేదరికం కాని
మనసుకు పేదరికం ఉంటుందా?
కొండ ఎంత కఠినంగా ఉన్నా
ఉలిమొన పదునుగా ఉంటే పగులదా?
ఘన శివ భక్తులకు పేదరికం లేదు
సత్యులకు దుశ్కర్మం లేదు
నాకు మారేశ్వరప్రియ అమరేశ్వర లింగం ఉన్నప్పుడు
ఎవ్వరి హంగూలేదు మారయ్యా / 1291 [1]

ఆశ అనేది రాజుకు కాక
శివభక్తులకు ఉంటుందా అయ్యా
రోషమనేది యమదూతలకు కాక
అజాతుల కుంటుందా అయ్యా
బియ్యం ఆశ నీకేందుకు, ఈశ్వరుడొప్పుకోడు
మారయ్య ప్రియ అమరేశ్వరలింగానికి దూరం మారయ్యా /1293 [1]

ఆయ్దక్కి (పరిగబియ్యం) లక్కమ్మ: ఆయ్దక్కి (పరిగబియ్యం) మారయ్య పెళ్ళాం. మూలత: రాయచూరు జిల్లా లింగసూరు తాలూకా అమరేశ్వరానికి చెందిన ఈ దంపతులు బసవన్న గారి కీర్తివార్తను విని కల్యాణానికి వచ్చి బియ్యమేరికొనే కాయకం చేపడతారు. కాలం క్రి.శ.1160 ఇష్టదైవం అమరేశ్వరుడు. "మారేశ్వరప్రియ అమరేశ్వరలింగ" అంకితంగా వ్రాసిన 27 వచనాలు ఇప్పటికి లభించినవి. అన్ని కూడ కాయక-దాసోహాల విషయాన్ని ఎత్తి నిలిపినవే. శూన్య సంపాదనములో ఈ దంపతలు కాయకనిష్ఠను గురించిన కథ అద్భుతంగా, అందంగా నిరూపితమయింది.

భక్తుల కాయకం అని దాయగారికంగా తెచ్చి
దాసోహం చెయవచ్చునా?
ఒక్క మనస్సుతో తెచ్చి ఒక్క మనస్సుతో చేసి
రెమడు విధాలు కాక మునుపే
మారయ్య ప్రియ అమరేశ్వరలింగంలో చెల్లుబాటు కావాలి మారయ్యా /1296 [1]

మనస్సు శుద్ధంగా లేనివాడికి ద్రవ్యానికి పేదరికమేగానీ
చిత్తశుద్ధితో కాయకం చేసేటప్పుడు
సద్భక్తునికి లక్ష్మి ఎక్కడ చూస్తే అక్కడ తానే అయి ఉంటుంది
మారయ్య ప్రియ అమరేశ్వర లింగం కొలువు ఉన్నంత వరకు /1297 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous ఆయ్దక్కి (పరిగబియ్యం) మారయ్య ఉరిలింగ పెద్దిగారి పుణ్యస్త్రీ కాళమ్మ Next