Previous నిరాలంబ ప్రభుదేవుడు బసవలింగదేవుడు Next

పరంజ్యోతి

మకుటం వరనాగుని గురువీరుడు పరంజ్యోతి మహావిరక్తి
కాయకం: గురువు, ద్వితీయ శూన్య పీఠాధీశ

కాయముదాల్చి మాయ వదలాలను మొద్దులకు
మాయ వదిలేదెట్లయ్యా
దేహముదాల్చి చూచి గాంచి
ఆ అమృతం భుజించామని పల్కుతారు
ఆ అమృతం తిన్నపిదప ఆకలుంటుందా? చెప్పరా
ప్రళయ విద్య, వాత, పిత్థ, క్లేష్మాలను త్రావి
ఆ అమృతం త్రాగామన్న వారికి
ఏనాటికి కొరకదు కనరా
ఇటువంటి భ్రాంతులు, భ్రమితులు పడ్డపాట్లకు
కొనలేదు మోదల్లేదు
చిత్తే తానైన మహాత్మునికి
లయలేదు, భయంలేదు, అనువులేదు
దేహంతో చూడగల కోతిచేష్టలు, ఎన్నటికీ లేవు
మహొతోత్తముడైన
వరనాగుని గురువీరుడే పరంజ్యోతి మహావిరక్తి / 2437 [1]

పరంజ్యోతి: సుమారు 17వ శతాబ్దంలో వుండవచ్చుననిపించే ఈతని గురించిన వివరాలులేవు. "పరంజ్యోతి వచనాలు" అనే శీర్షిక క్రింద ఈ వచనాలు దొరుకుతున్నందున పరంజ్యోతి ఈతని పేరు కావచ్చును. "వరనాగుని గురువీరుడు పరంజ్యోతి మహావిరక్తి", అన్న మకుటంతో 13 వచనాలు లభించాయి. తనను తానెరుగక, నతలోనున్న పరమాత్ముని స్వరూపాన్ని గురుతించక ఇతరులను దారితప్పించే వేషడాంభికులను విడంబించడం విటి ముఖ్యధ్యేయమైవుంది.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous నిరాలంబ ప్రభుదేవుడు బసవలింగదేవుడు Next