Previous మారయ్యగారి పుణ్యస్త్రీ గంగమ్మ సిద్ధాంతి వీరసంగయ్య Next

సత్తిగె (గొడుగుల) కాయకపు మారయ్య

మకుటం ఐఘటేశ్వర
కాయకం: యాజమానులకు గొడుగుపట్టే కాయకం.

ఉదయంలో ఉత్పత్తియై, మధ్యాహ్నన్నానికి స్థితిని చేరి
అస్తమయ వేళలయందే దేహాన్ని పొందిన పిదప
నిశ్చింతగా నిల్చి కష్టాలు విడివడే ఠావు చూపరా
పగలు ఆకలి, దాహం, రేయికి విషయవ్యసన వ్యాపారాలు
ఇలాంటి దేహంలో చేరి
పమచ భూతాలైదింటికి నెలవైతివికదా ఐఘంటేశ్వర లింగమా /2099 [1]

సత్తిగె (గొడుగుల) కాయకపు మారయ్య: ఇతనిది యాజమానులకు గొడుగుపట్టే కాయకం. దాంతోపాటు చెట్లు నరకడం కగడపట్టే పనికూడా చేస్తూ వుండినట్లు తెలియవస్తున్నది. దీనికి సాక్ష్యం ఆయన వచనాల్లో ఆధారాలు దొరుకుతాయి. కాలం. క్రీ. శ. 1160. "ఐఘటేశ్వర" అంకితముద్రతో దొరికిన ఇతని వచనాల సంఖ్య 10. కాయకనిష్ఠ కాయకం తప్పేవారిపై విమర్శా ఇందులో వస్తువు.

కాయకమని కల్పించుకొని చేసేవేళ
దొంగలాగ పెళ్ళాం, పిల్లల కోసమని
దాచుకొన్న బుట్టలో తీసుకొనిపోయి
పరమ పవిత్రమైనది ఇచ్చినా
అది గురు పర, చర ఈ మూడింటి ప్రసాదము కాదు
అట్టివాడు మృఢ భక్తుడని వాడింట్లో చేరి తింటే
కుక్క తినగా మిగిల్చిన ఎంగిలి మాంసాన్ని నక్కలు తిన్నట్లు
ఐఘంటేశ్వర లింగము సాక్షిగా...! /2100 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous మారయ్యగారి పుణ్యస్త్రీ గంగమ్మ సిద్ధాంతి వీరసంగయ్య Next