Previous మైదున (మరిది) రామయ్య మారేశ్వరొడెయ(డు) Next

మధువయ్య

మకుటం అర్కేశ్వరలింగ

1903
ఆహారం ఆకలిగొని తన్ను తాను తిన్నదెవరూ ఎరుగరు
నీళ్ళు దప్పికగొని నేలను త్రావుట నేవరూ ఎరుగరు
దేవుడు రూపం దాల్చి అందరిలో గతిచెడుట నెవరూ ఎరుగరు
విపరీతపు చిన్నె అయింది
అర్కేశ్వరలింగని లక్ష్యంలోనికి వచ్చిన కారణంగా! /1903 [1]

మధువయ్య: మూలత: బ్రాహ్మణుడైన ఈ శరణుడు తన కూతురును అంత్యజుడైన హరళయ్య కుమారునికిచ్చి పెళ్ళి చేశాడు. ఆ కారణంగా మరణ దండనకు గురియైనాడు. అంకితముద్ర "అర్కేశ్వరలింగ" 102 వచనాలు దొరికి ఎక్కువగా మార్మిక పరిభాషలోనున్నాయి. లింగానుసంధానం, శివానుభవ సాధన, ధర్మభాహిరుల నింద, కులజాతుల చర్చ, వైయుక్తిక జీవితంలోని మెరపులూ అందులో చోటుచేసుకొన్నాయి.

తెరచాప స్థంభంపై కాకిలా
జీవి ఎంత ఆరాటపడినా
ఆశయను వలకు చిక్కిన వారెవరైనా
నిశ్చయము నేఱుగ గలరా?
కూటికోసం కోటి వేషాలు వేసే
చిత్త శుద్ధాత్మలేని వారిని ఒప్పదు అర్కేశ్వరలింగము /1904 [1]

తనవు నిర్వాణం -మనస్సు సంసారం
మాట బ్రహ్మం -నీతి అధమం
ఇదెట్టి జ్ఞానం?
హంతకుని చేతి కత్తిలా
ఇది తగినది కాదు, అర్కేశ్వర లింగము నెరుగుటకు /1905 [1]

లింగము నెఱిగి అంగము లయం కావాలి,
మొలకెత్తి బీజం నష్టమైనట్లు
స్వయంభువే వెలసి ప్రతిష్ఠ అక్కరలేనట్లు
అర్కేశ్వరలింగము నెరిగిన గురిపై వలపు. /1906 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous మైదున (మరిది) రామయ్య మారేశ్వరొడెయ(డు) Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys