| మకుటం | నిస్సంగ నిరాళ నిజలింగ ప్రభూ | 
            
        
        
            శ్రీ గురుస్వామి కరుణించి ఇచ్చిన ఇష్టలింగం
            కర, మన, భావల్లో వుంచి పూజించడం తెలియక
            భ్రష్ట విప్రుని మాటవిని నష్టానికి గురయ్యే
            కంచు, తామ్రం మొదలైన అనతదేవుళ్ళు భజనలు చేసే
            మడ్డి జడమానవుల నాకెప్పుడూ చూపకుమయ్యా
            నిస్సంగ నిరాళ నిజలింగ ప్రభూ /2436 [1]
            
            నిరాలంబ ప్రభుదేవుడు: "నిస్సంగ నిరాళ నిజలింగ ప్రభూ" అన్న అంకితముద్రతో 14 వచనాలు దొరికాయి
            తప్ప ఇతని గూర్చిన మరేవివరమూ అందడంలేదు. "శివభక్తి పంచాంగ వచన" అని పులువబడ్డ ఈ వచనాల్లో
            శివాచారపథం తెలియక పంచాంగాలు వినేవారిని ఇతర మూఢ నమ్మకాల్ని కటువుగా విమర్శలున్నాయి.
        
     
    
        Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *