Previous సూళె (లంజ) సంకమ్మ అడపం అప్పన్న Next

సొడ్డళ బాచరసు

మకుటం సొడ్డళ
కాయకం: కరణికుడు (accounant cum clerk)

అన్నలమనే అన్నలను వెక్కిరించింది పసిడి
అన్నలమనే అన్నలను వెక్కిరించింది పడతి
అన్నలమనే అన్నలను వెక్కిరించింది వసుధ (మన్ను)
పసిడిని కన్నపిదప అన్నల కన్నలున్నారా?
పడతిని కన్నపిదప అన్నల కన్నలున్నారా?
వసుధను కన్నపిదప అన్నల కన్నలున్నారా?
పసిడి, పడతి, వసుధలనే మచ్చును జగతి కళ్ళల్లో
పోసి మిమ్ము తలచేందుకు తెరవు చూపవుకదా
ముక్కంటి సొడ్డళ గరళధరా! /2110 [1]

సొడ్డళ బాచరసు: బసవన్నకు పరమాప్తుడిగా పేరుగాంచిన ఈయన బిజ్జళుని రాజభవనంలో కరణికుడుగా వుండేవాడు, ఇతడు సౌరాష్ట్ర సోమేశ్వరుని భక్తుడు. బసవపురాణంలోనూ, భైరవేశ్వర కథామణి సూత్ర రత్నాకరం మోదలైన కృతుల్లో ఇతని జీవితానికి సంబంధించిన వివరాలు తెలుపబడ్డాయి. కాలం క్రీ.శ.1160. "సొడ్డళ" అంకితముద్రతో 102 వచనాలు లభ్యమైనాయి. భాషాప్రయోగమ, నిరూపణాశైలి, ఇతరుల నుండి ఇతణ్ణి వేరుపరుస్తున్నాయి.

తినితిని, మెక్కి తిరిగే వారంతా యోగులా?
ఆహారానికేడ్చువాడు యోగియా?
వ్యసనాలకు దాసుడైనవాడు యోగియా?
వీరిని యోగులంటే వెంటనే ముక్కులు కోస్తా
యోగుల యోగి శివయోగి
సొడ్డలుడా! సిద్ధరాముడొకడే యోగి /2112 [1]

లింగదేవుడే కర్త శివభక్తుడే ఉత్తముడు
చంపకుండుటే ధర్మం
అధర్మంగా వచ్చిన దాని నొప్పుకొననిదే నియమం
భయం లేకుండా ఉండటమే వ్రతం
ఇదే సత్య పథం మిగిలినదెల్లా మిథ్యమని చూడరా
దేవరాయ సొడ్డళా /2125 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous సూళె (లంజ) సంకమ్మ అడపం అప్పన్న Next