Previous వచనభండారి శాంతరసు సకలేశ మాదిరాజు Next

శంకరదాసిమయ్య

మకుటం నిజగురు శంకరదేవ

జింక యతిలా, కాకి కోయిల్లా స్నేహంగా వుండకూడదా?
గిర్రున తిరిగి చర్రున మరగి బడలిపోయే
వారి నీచాతి నీచమైన అసహ్యత కనుమా
పగలురేయనక తిరిగేవారిని చూచి అసహ్యపడుతున్నాను
ఎరిగిన శరణుడు మరచిన మానవుడు
కుళ్ళిన కసవును మోస్తూ ఊరూరూ తిరిగి అమ్ముకొనే
కాషాయంబరిధారుల నొల్లడు నిజగురుడు శంకరదేవుడు. /2030 [1]

శంకరదాసిమయ్య: ఈయన జీవిత కథ శంకర దాసిమయ్యరగళె, శంకర దాసిమయ్యన పురాణ, బసవపురాణ, చెన్నపబసవపురాణం మొదలైన కావ్య-పురాణాల్లోకి ప్రముఖంగా ఎగబ్రాకింది. ఈ శరణుడు మొదట బ్రాహ్ముణుడు. బాగలకోట జిల్లా హునగుంద తాలూకా, స్కందశిలె (కందగల్లు) ఇతని స్వస్థలం. నవిలేలోని జడల శంకరలింగం ఆరాధ్యదైవం. శివదాసి ఈయన పత్ని, శివుని నుండి కళ్లు పొందిన సంగతి, కల్యాణ నగరిలో విష్ణువిగ్రహ దహనము చేసిన ఘటన,ముదునూరులో జేడర (సాలె) దాసిమయ్య ప్రసంగాలు, ఈయన చరిత్రలో మనం చదవగలం, కాలం క్రీ.శ.1130. "నిజగురు శంకరదేవ" అంకితముద్రతో వున్న ఈయనగారి 5 వచనాలు లభించినవి. బసవాది శరణుల స్తుతి, బసవావతారం యొక్క నేపథ్యం, కాయ-మాయల సంబంధం, కపట వేషధారుల టీక ఇక్కడ సూటియైన మాటలతో స్పష్టంగా చెప్పబడ్డాయి.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous వచనభండారి శాంతరసు సకలేశ మాదిరాజు Next