| మకుటం | 
                    అమరగుండం మల్లికార్జున | 
                
            
        
        
            జిపించే మనస్సుకు మట్టి చూపావు
            దర్శించే కళ్ళకు స్త్రీని చూపావు
            పూజించే చేతికి బంగారం చూపావు
            ఇలా త్రివిధాలను చూపించి
            మరుపునుంచావయ్యా
            అమరగుండం మల్లికార్జునయ్యా
            నీవు చేసిన విన్నాణానికి నేను నివ్వెరపోయాను /1825
          
            [1]
            
            పురం నాగన్న: ఇతడు అమరగుండ మల్లికార్జునుని కుమారుడు. స్థలం-అమరగుండం. అనగా తుమకూరు జిల్లాలోని గుబ్బి పట్టణం. కాలం క్రీ.శ. 1160 "అమరగుండం మల్లికార్జున" మకుటంతో ఈయనవి 9 వచనాలు దొరికాయి. బసవాది శరణుల స్తుతి. నిజానంద భక్తిని గురించిన కాంక్ష గురుని పాదోదక మహిమ, శరణుని స్వరూపం, లింగనిష్ఠ మొదలైన విషయాల వివరాలిందులో వున్నాయి. కొన్ని వచనాలు మాత్రం వెడగు (మార్మిక) పారిభాషికంలో వున్నాయి.
           
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *