Previous సొడ్డళ బాచరసు అడపం అప్పన్నగారి పుణ్యస్త్రీ లింగమ్మ Next

అడపం అప్పన్న

మకుటం బసవప్రియ కూడల చెన్నబసవన్న
కాయకం: తాంబూలపు పెట్టె మోసేవాడు.

అన్నము పెట్టిన నేమి? బంగార మిచ్చిననేమి?
మగువ నిచ్చిననేమి? మట్టి నిచ్చిననేమి?
పుణ్యముగలదందురు
వారి నుండి అయిన సోమ్మేమి? వారివ్వడానికి
ఇందులో పున్నెమేది? పాపమేది?
నదీ జలాన్ని నదికర్పించి,
తనకు తను పుణ్యం కలదనే బడుగు బాపనవానిలా,
నదమల మైన చిర మహాఘన లింగాన్నెరుగక,
ఇట్టివేమి చేసినా చివరికి నిష్పల మన్నవాడు
మన బసవప్రియ కూడల చెన్న బసవన్న /2134 [1]

అడపం అప్పన్న: బసవన్నగారి ఆప్తకోటిలోని ఈతడు తాంబూలపు పెట్టె మోసేవాడు. అదీ అతని కాయకం. భార్య శరణి మరియు వచనకారిణి లింగమ్మ. చెన్న బసవేశ్వరుడీతని గురువు. కల్యాణక్రాంతి సమయంలో బసవన్నగారితో పాటు కూడల సంగమదాకా వెళతాడు. బసవన్న ఆదేశం మేరకు కల్యాణానికి వెళ్ళి నీలమ్మను పిల్చుకు వచ్చేంతలో ఆయన ఐక్యమైనవార్త తెలుస్తుంది. ఆ పిమ్మట నీలమ్మ, అప్పన్నలూ ఐక్యమవుతారు. తంగడగి గ్రామం సమీపం ఇతని సమాధి ఉంది. బనవాసిలోని మధుకేశ్వర దేవాలయ ప్రాంగణంలోని శివోత్సవ మంటపం దగ్గర గగ్గరి రాతిమీది శరణుల శిల్పాల్లో అప్పన్న విగ్రహం కూడా ఉన్నది. అప్పన్న "బసవప్రియ కూడల చెన్నబసవన్న" మకుటంతో 200 పైగా వచనాలు రచించాడు. వీటిలో మార్మిక వచనాలు అధికం. షట్‍స్థల తత్వ నిరూపణకు ప్రథమ పీఠం. కొన్నింటిలో కథనశైలి కూడ గోచరిస్తున్నది.

అయ్యా, మీ శరణుల వేషాలు చూపి గ్రాసాన్ని వేడుకొనువారు కారు!
దేశాలు దిరిగి నేర్చిన పలుకులు పలుకువారు కారు.
బాగుగా పలుకుదురు, ఆశలు లేక నడిచెదరు, రోషమూ లేక
పలుకుదురు.
హర్షించక విందురు, విరసం లేక ముట్టుకొందురు
సరసమున్న చోటనే వసింతురు
ఈ విధాన కలగలవుకొని అన్యము లేని
నిజైక్యునికి నమో నమో అంటాను
బసవప్రియ కూడల చెన్న బసవన్న,
ఇటువంటి శరణుల ఉనికిని నేనేక్కడ ఎరుగుదునయ్యా /2135 [1]

నింగినే నెట్టుతున్నవాడికి
నిచ్చెన దాక్షిణ్యముంటుందా?
ఒక్క మనసును ఆపగలరా?
వేరొక సాకారముంటుందా?
కావాలి, వద్దు అనేవి రెండూ లేనివాడికి
ఇహలోకపు దాక్షిణ్యముంటుందా?
ఈ హెచ్చరిక మీలో ఏకమైయున్న శరణునికి తప్ప
లోకపు మానవులకుంటుందా,
మీ ఉనికి తెలుసుకోవడం?
బసవప్రియ కూడల చెన్న బసవన్న /2137 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous సొడ్డళ బాచరసు అడపం అప్పన్నగారి పుణ్యస్త్రీ లింగమ్మ Next