Previous గోరక్షుడు గురుపురద మల్లయ్య Next

గుప్త మంచన్న

మకుటం నారాయణప్రియ రామనాథ
కాయకం: కల్యాణరాజు బిజ్జలుని ఒక మంత్రి

కాలాన్ని తెలుసుకోవడానికి కోడినయ్యాను
ఋతువు కాలాలను తెలుసుకోవడానికి కోకిలనయ్యాను
శాఖా చంక్రమణం తెలుసుకోవడానికి కోతినయ్యాను
పంచేంద్రియాల మరణాన్ని తెలుసుకోవడానికి మలత్రయానికి దూరమయినాను
నారయణ ప్రియ రామనాథుడు! /1662 [1]

గుప్త మంచన్న: కల్యాణరాజు బిజ్జలుని ఒక మంత్రియైన ఇతను దామొదరుని కుమారడు. కల్లి పేరు మాయావాది మూలత: వైష్ణవ ధర్మానుయాయియైనా, బసవన్నగారి ప్రభావంతో శరణధర్మానికి మారుపొయి రహస్యంగా శివభక్తిని ఆచరిస్తాడు. ఒకసారి అకస్మాత్తుగా అది అందరి ఎదుట ప్రకటపడగా ఆమీద అయిన బహిరంగంగా తన శరణధర్మ ప్రేమను చూపుతూ అనుభవ మంటపగోష్ఠులలో పాల్గొంటూ వుంటాడు. బ్రతుకంతా శివభక్తికె ముడుపుకట్టి కల్యాణంలోనే ఐక్యమౌతాడు. కాలం క్రి.శ.1160 "నారాయణప్రియ రామనాథ" అనేది ఈయన వచనాంకిత ముద్ర వైష్ణవ పంథానుండి శరణ పథానికి పరివర్తనచెందే సమయంలో కలిగిన మానసికమైన ఊగసలాట వేదనా చిత్రాలు ఈ వచనాల్లో విశేషంగా కానవస్తాయి. అనేక వచనాలు వెడగు (మార్మిక) పద్ధతిలోనున్నాయి. ఈయన వచనాల్లోని స్వభావొక్తులు లొకానుభవంతో నిండి అపూర్వంగా వుంటాయి. మొత్తం దొరికిన వచనాలు 102.

కత్తి లేనివానికి కదనముంటుందా?
ఆత్మ లేని దేహానికి చైతన్యముంటుందా?
జన్మరహితుని నీతిని తెలియనివాడు
ఖచ్చితమైన జ్యోతిర్మయుని తెలియునా?
ఇష్టలింగమునేరుగని వాని మాటల నీతి
ఓటి కుండలో దాచిన నీరు
నారయణ ప్రియ రామనాథ! /1666 [1]

లోకము గురించైతే ఆచారపుమాట
తన గురించైతే అనాచారపుమాట
ఆచార సంపన్నులనేక్కడైనా చూస్తాను
అనాచార సంపన్నులనేక్కడా చూడలేదు
భవి భక్తుడు కావచ్చును కానీ భక్తుడు భవికారాదు
వెన్ననుండి నేయిగానీ, నేయి వెన్న కాగలదా?
తరువు ఎండిన మొడుగానీ, మొడేండినప్పుడు తరువుంటుందా?
ఇది అఘటితం, అనామయం
నారయణ ప్రియ రామనాథా! /1670 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous గోరక్షుడు గురుపురద మల్లయ్య Next