Previous కొండెకిడి మంచెనగారి పుణ్యస్త్రీ లక్ష్మమ్మ కూగిన(కూతల)మారయ్య Next

కొట్టణపు సొమమ్మ (దంపుడుల సోమమ్మ)

మకుటం నిర్లజ్జేశ్వరుడు
కాయకం: భక్తుల ఇళ్ళల్లో వడ్లు దంచడము

అదనుతప్పి దంచడానికి నూకలే కాని బియ్యం లేవు
వ్రతహీనుని దరి నరకమేకాని ముక్తిలేదు
తెలియకుంటే పోనీ, తెలిసి కలసిన వాడనైతే
కాల్చిన కత్తితో చెవిని కోస్తారయ్యా
మంచి తెలిసిన వాడనయ్యా
మీ ఆన నిర్లజ్జేశ్వరా / 1308 [1]

కొట్టణపు సొమమ్మ (దంపుడుల సోమమ్మ): భక్తుల ఇళ్ళల్లో వడ్లు దంచి వచ్చే వరమానంతో గురులింగ జంగమాల సేవించడం, ఈమె జీవన విధానం. ఒకే ఒక్క వచనం ఈమెది దొరికింది. అంకితముద్ర "నిర్లజ్జేశ్వరుడు", నిర్లజ్జ శాంతేశుడు ఈమె గురువు. వ్రతాచరణ శుద్ధి ఈమె వచనాలు ప్రతిపాదిస్తాయి. ఆ విషయాన్ని తన వృత్తి పరిభాషలో అత్యంత సమర్ధవంతంగా తన బావాన్ని వ్యక్తీకరించారీమె.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous కొండెకిడి మంచెనగారి పుణ్యస్త్రీ లక్ష్మమ్మ కూగిన(కూతల)మారయ్య Next