| మకుటం | 
                    బళ్ళేశ్వర | 
                
                
                    | కాయకం:
                     | 
                    వ్యాపారవృత్తి  | 
                
            
        
        
            అపార మహిమాన్వితుడంటుంది మీ ఢంకా
            కోరుకున్నదిచ్చేవాడంటుంది మీ తప్పెట
            జగవందిత లోకనాయకుడంటుంది మీ శంఖం
            పరదైవం లేదంటుంది మీ ఢమరుకం
            శివుడు వేధించడనేవారి నోటిని త్రిశూలంతో పాడుస్తానని
            బళ్ళేశ్వరలింగని చాటింపు ముల్లోకాలలోనిదయ్యా /1844
            [1]
            
            బళ్ళేశమల్లయ్య: మూలత: జైన వ్యాపారియైన మల్లశెట్టి శరణ ధర్మాన్ని స్వీకరించి మల్లయ్యయైనాడు. ధాన్యమున కొలిచే సేరునే లింగ స్వరూపంలో గాంచి పూజించి బళ్ళేశమల్లయ్య అయినాడు. వ్యాపారవృత్తిని చేపట్టిన ఇతను శరణుల అనుభావగోష్టిలో పాలుపంచుకోవటం ద్వారా తాను సిద్ధింపచేసుకొన్న అనుభావంతో వచన రచనగా గావించాడు. దొరికిన 9 కూడ వెడగు (మార్మిక) వచనాలే కాలం క్రీ.శ. 1160 అంకితముద్ర "బళ్ళేశ్వర".
           
            
            
            ఏ ప్రాణికి నొప్పి కలిగించొద్దు
            పరస్త్రీల సంగం వద్దు
            పరధనానికి ఆశపడవద్దు
            పరదైవానికి నమస్కరించవద్దు
            ఈ చతుర్విధాలు తహతహగా చేస్తున్నప్పుడు
            పరులు చూస్తారు, చూడలేదని అనుకోవద్దు
            బళ్ళేశ్వరలింగునికెవరు చాటు చెయ్యకూడదు గనుక
            అఘోర నరకంలోకి నెట్టుతాడు. /1845
            
             [1]
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *