Previous శరణ శరణెయలు పెర్ల జాబితా అక్కమ్మ Next

అక్కమహాదేవి, మహాదేవి అక్క,

మకుటం: చెన్న మల్లికార్జున
ప్రత్యేకత: కన్నడ భాషయొక్క మొదటి కవయిత్రి

*

కామారిని గెలిచాను బసవా మీవలన
సోమధరుని పట్టుకొన్నాను బసవా మీ దయవలన
నామంలో ఆడదన్న పేరైనంతలో ఏమిలోటు
భావించి చూస్తే మగరూపు బసవా మీ కృపవలన
అతికామి చెన్నమల్లికార్జుని తోందరించి
మరియొక టెరుగక కూడితిని బసవా మీ కృపవలన. - అక్క మహాదేవి/1161 [1]

తన వినోదానకై తానే సృజించెను సకల జగము
తన వినోదానకై తానే దానికి కట్టబెట్టెను సకల ప్రపంచము
తన వినోదానకై తానే త్రిప్పెను సకల భవ దు:ఖములందున
ఇట్లు నా చెన్నమల్లికార్జునుడను పరశివుడు
తన జగన్నాటకము చాలైన పిమ్మట
తానె త్రెంచి వేయును దాని మాయాపాశము -అక్కమహాదేవి/1191[1]

నేలదాగిన నిధానంలా
పండున దాగిన చవిలా
రాతిని దాగిన పుత్తడిలా
నువ్వులలో దాగిన నూనెలా
మానులదాగిన తేజంలా
భావమునదాగి బ్రహ్మమై వున్న
చెన్నమల్లికార్జునుని నిలువు తెలియలేము -అక్కమహాదేవి/1199[1]

మహాదేవి అక్క, అక్కమహాదేవిగా పిలువబడుతున్న ఈమె వచనకారుల్లో అగ్రగణ్యురాలు. కన్నడంలో శ్రేష్ఠ కవయత్రి, చెన్న మల్లికార్జుననుని పతిగ భావించి లౌకిక సంసారాన్ని తిరస్కరించిన విరాగిణి.

కన్నడ, తెలుగు భాషలోని అనేక కావ్య పురాణాలు ఈమె జీవత చరిత్రను వివరిస్తాయి. ఈమె తండ్రి (నిర్మలశెట్టి) ఓంకారశెట్టి, తల్లి (సుమతి), లింగమ్మ, జన్మస్థలం కర్నాటక రాష్ట్రంలొ శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాకు చేరిన ఉడుతడి (ఉడుగణి). తమ కూతురుకు ’మహాదేవి’ అని పేరిడి ఆమెకు గురులింగదేవరచే దీక్షాసంస్కారమును చేయించిరి. ’శరణసతి-లింగపతి’ అను తత్త్వముననుసరించి ఇష్టలింగరూపముతో యుండి దేవుడే తన భర్తయని దృఢసంకల్పముతో బాల్యదశయందే మహాదేవి రేయింబవళ్ళు దేవచింతనయందే కాలము గడుపచుండెను.

యవ్వన దశకు వచ్చు సరికి ఆమెలో ఇష్టలింగపూజానిష్ఠ భావము పెంపొందువచ్చెను. మహాదేవి కడురూపవతి. యవ్వనంలో ఆమెరూప లావణ్యములు హెచ్చెను. కౌశికుడనే రాజు ఈమె లావణ్యానికి మనసు పారెసుకొని పెళ్ళికి బలవంతపెడతాడు. పరిస్థితుల ఒత్తిడికి తలొగ్గిన అక్క తన తల్లిదండ్రుల ప్రాణరక్షణకై మరియు తన మానరక్షణకై తన ఇష్టదైవముగు చెన్నమల్లికార్జునుని మనసులో ధ్యానించి తాను రాజును పెళ్ళియాడుదునని, కాని అంతకు ముందు రాజుతన మూడు కోరికలను ఒప్పుకొనిననే రాజభవనమును ప్రవేశించెదనని, ఆ తరువాత ఏ ఒక్కకోరికను రాజుమీరినటులైన ఆరాజ భవనము నుండి వెడలిపోవు స్వాతంత్య్రమునకు రాజు అంగీకరించవలసినదని షరతు విధించెను. రాజు ఆ షరతులకు అంగీకరించెను. కావున ఆమె రాజభవనమును ప్రవేశించుట జరిగెను.

రాజభవనములో ఆమె కోరికలు ఐదు వారములకాలము ఇష్టలింగ పూజ గురు-లింగ-జంగముల పూజ మరియు దాసోహములందు రోజూ నిమగ్నమైయుండగా కొంతకాలముగడచెను. కామాతురుడైన కౌశికునకు ఆమెతో వివాహమాడు ప్రస్తావనకు అవకాశములేకుండాపోయెను. విరహవేదన అధికమాయెను. ’కామాతురాణాం నభయంనలజ్జ’ అనునటుల తాను చేసిన వాగ్దానమును మరచి ఇష్టలింగనిష్ఠయందున్న మహాదేవిని తాకబోయెను. ఆమె చిత్కరించి నాకిచ్చినమాటను తప్పి అవివాహితగానున్న నన్ను బలాత్కరించుట న్యాయమా? అని ఆతడు చేసిన వాగ్దానమును గుర్తునకు తెచ్చి నీవిచ్చిన మాటప్రకారము నెనిపుడు స్వతంత్రురలను అనిపలికి కోపముతో తన వలువలను విప్పి అతడిపైకి విసిరివేసి ఇలానుడివెను.

"అమేధ్యపు కడవ, మూత్రపు బుడిగె
ఎముకల తడక చీము బుడ్డ
కాలిపోనీ ఈ దేహము, ఈయెసలిని నమ్మి
చెడకుము చెన్నమల్లికార్జునుని దెలియని పిచ్చివాడా

ఎన్నికోరికలను కడుపు అనే కడపలో దాచుకొననట్టి, మూత్రమూ అను విసర్జిత పదార్థమును కలిగినట్టి, ఎముకలతడకవమటి, చీముపట్టునట్టి ఈ దేహము నశించునట్టిది. అట్టి ఈ దేహమును నమ్మిచెడకుము. పరమాత్ముని తెలియని పిచ్చివాడా అనుచు తన అందమైన శరీరముపై కామమునకు బదులుగ జుగుప్సకలిగేలా చేసి తనపోడవాటి వెంట్రుకలే ఆచ్ఛాదనముగా రాజభవనము నుండి కదలివెడలేను.

కౌశికుని రాజభవనము వీడిన పిదప అమె తల్లిదండ్రులు, సఖులు ఎంత వారించనను తన ఇంటికి పోవుటుకు మహాదేవి ఇచ్ఛగించలేదు. అప్పటికె ఆమె కల్యాణము నందలి బసవేశ్వరులు గురించి వారి నూతన క్రాంతికారి ’లింగవంత’ ధర్మము గురించి, మరియు వారు నెలకొల్పిన అనుభవ మంటపములో శరణుల గోష్ఠుల గురించి విని యున్నందున అచ్చటికి వెడలుటకు నిశ్చయించుకొని ప్రయాణమైవెడలెను. మార్గమధ్యమున దుండగుల వలన కొన్ని ఇడుములు కలిగినను వాటిని తన పూజా నిష్ఠ వలస ప్రాప్తించిని దైవిశక్తితో తప్పించుకొనుచు ఆమె క్షేమముగ కల్యాణమును చేరుకొనెను. బసవేశ్వరులవారి నివాస స్థానమగు ’మహామనె’ (గొప్పైన గృహము) ప్రవేశించినంతనే బసవణ్ణ అంతరంగికుడు హడపద అప్పన్న ఆమెకు సొదరముగా స్వాగతము పలికి బసవేశ్వరుల వారి దర్శనము చేయించెను. మహాదేవి మహాదానందమును పొందెను. అచ్చట బసవన్నవారి భార్య నిలాంబిక మరయు ఆతడి అక్క నాగలాంబికల పరిచయము కలిగెను. అచట బసవన్న వారెచే జంగమదీక్ష బడసిన అక్కమహాదేవి ఏకదేవోపాసనను అలవరుచుకొనిరి. ఈ కారణముగా తాను పలికెడి వచనములందు ’చెన్నమల్లికార్జునా’, ’చెన్నమల్లికార్జునదేవర దేవా’ అని పలుకదొడగిరి. వారి ఆశ్రయములో మహాదేవి ఇష్టలింగ పూజానిష్ఠురాలాయెను. వారామెను అనుభవ మంటపమునకు తోడదకొని వెళ్ళిరి. కాని ప్రభుదేవుడు ఆమెను నిలువరించి కొన్ని ప్రశ్నలను సంధించగా వాటికామె తగు ఉత్తరముల నిచ్చెను. అనుభవ మంటపమునందలి శూన్యపీఠాధీశుడగు అల్లమప్రభుదేవుడు సంతసించి సభాసదులందరి ఎదుట ఆమె వైరాగ్యతేజస్సను, లింగాంగ సామరస్యానుభవమును పొగడి ’మహాదేవి అక్క’ శ్రీపాదములకు నమొ నమొ యందును అని సంబోధించి ఉన్నతాసనమున కూర్చుండజేసెను. ఆ రోజు నుండి ఎల్లరచె మహాదేవి ’అక్కమహాదేవి’గా పిలువ బడెను. కొన్నాళ్ళు ఆమె బసవేశ్వరుని గృహమునందు వారి కుటుంబ వ్యక్తులలో ఒకరగా ఉండి, అనుభవమంటపము నందలి అనుభావ జ్ఞాన చర్చలలో పాల్గొని తన అనుభవమును అభివృద్ధి పరచుకొనెను. అనుభవ మంటపంలో తన స్పష్టమైన పలుకు, ధీరవైచారిక వైక్తిత్వంతో అందరి మెప్పుకు పాత్రురాలౌతుంది. అక్కడ కొన్నాళ్ళుండి, తరువాత, ప్రభుదేవుని ఆదేశానుసారం చెన్న మల్లికార్జునుని స్థానమైన శ్రీశైల పర్వతంచేరి అక్కడి కదళివనంలో ఐక్యం పొందుతుంది.

మహాదేవి అక్క విచార స్వాతంత్రము కలిగిన మహిళ. మగఢు మరియు వ్యక్తి స్వాతంత్ర్య, రెంటిలో ఆమె వ్యక్తి స్వాతంత్య్రాన్ని ఎంపిక చేసికోని మగణ్ణి ధిక్కరించింది. అక్క యొక్క ఈ నిలువు లొకేతిహాసంలో అపురూప ఘటనగ నమొదైంది. అక్క ఒక చక్కని వచనకారిణి. ’చెన్న మల్లికార్జున’ అనే అంకితముద్రతో 434 వచనాలు లభించి వాటిలో ఆమె జీవన సాధనలోని అన్నిదశల భావలహరులు సజీవమైన అభివైక్తిని పొందివున్నాయి. జివితంలోని బాధలు, ఆనందాలు మరియు ఆమె ఆధ్యాత్మిక ధృఢత్వం ఈ అభివ్యక్తిలోని వైశిష్ట్యాలుగా కనిపిస్తాయి. శరణసతి-లింగపతి భావం వీటి స్తాయి భావంగా వుంది. భావ తీవ్రతవల్ల భావకవిత్వ గుణాన్ని కల్గిన ఈమె వచనాలకు వచన సాహిత్యంలో ఏ విధంగా చూచినా కూడా ఒక ప్రత్యేక స్థానం కేటాయించబడింది. సమకాలికులైన ఎందరో శరణ వచనకారులు అక్క ఘటనను గుర్తించి ప్రస్థుత చేశారు. వచనరచనతో పాటు ’యోగాంగ త్రివిధి, స్వరవచన, సృష్టియవచన, మంత్ర గొప్య’లనబడె లఘుకృతులు వెలువరించినా ఆమె సమగ్రమైన అంతరంగ దర్శనం మాత్రం ఆమె వచనాల్లో అద్భుతంగా వ్యక్తికరింపబడిన దన్నది నిర్వివాదాంశం.

వేదశాస్త్ర ఆగమ పురాణములన్ని
పొల్లున దంచిన నూకతౌడు కనండహో
ఇవి దంచనేల? దించ నేల?
అటు ఇటు పరుగుదేయ మనసు లోతులను తెలిసికోంటే
పట్టితనపు బట్టబయలు చెన్నమల్లకార్జునా - అక్క మహాదేవి/1225 [1]

సంగము నుండి కాక అగ్ని పుట్టదు
సంగము నుండి కాక విత్తు మొలకెత్తదు
సంగము నుండి కాక పూవు వికసించదు
సంగము నుండి కాక ఏ సుఖమూ అనుభవమునకు రాదు
చెన్నమల్లికార్జునయ్యా
మీ మహానుభావుల సంగంతో నేను
పరమ సుఖియైతినయ్యా -అక్కమహాదేవి/1227 [1]

చావులేని, కీడులేని, రూపలేని, అందగాణ్ణి నేవలచాను
ఎడంలేని కడయులేని, తెరవులేని, గురుతులేని
అందగాణ్ణి నేవలచాను అమ్మలారా
భవములేని, భయములేని, నిర్భయుడందగాణ్ణి వలచాను నేను
ఊరలేని, పేరులేని వానిని వలచాను నేను
చెన్నమల్లికార్జునుడను మగని
ఎక్కెక్కువ నేవలచాను అమ్మలారా! -అక్కమహాదేవి/1230 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం:డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous శరణ శరణెయలు పెర్ల జాబితా అక్కమ్మ Next