మకుటం |
నా అయ్య ప్రియ ఇమ్మడి ని:కళంక మల్లికార్జున |
కాయకం:
|
రాణి, కట్టెలుకొట్టి తెచ్చి అమ్మే కాయకం |
ఊర్వశి కర్పురాన్ని నమిలి
అందరికి ముద్దిస్తే మెచ్చుతారు కాని
పంది కర్పూరాన్ని తిని
అందరిని చుంబిస్తే మెచ్చుతారా
హుడుహుడు అని తోలుతారు తప్ప
మాట నడవడి శుద్ధంగా లేనివారు
పురాతనలు వచనాలను చదివితే
అనుభావం చూపితే మెచ్చగలరా?
మాట నడత శుద్ధంగా లేనివారు
పురాతనలు వచనాలను చదివినప్పుడు
ఆ పందికంటే కనాకష్టం
మా అయ్య ప్రియ ఇమ్మడి నిష్కళంక మల్లికార్జునా! /1332
[1]
మోళిగె మహాదేవి: ఈమె కాశ్మీరదేశపు మహాదేవభూపాలుని రాణి అసలు పేరు గంగాదేవి. మగనితో కలిసి కల్యాణానికి వచ్చి రాణిత్వపు వైభవజీవితాన్ని త్యాగం చేసి కట్టెలుకొట్టి తెచ్చి అమ్మే కాయకం చెపట్టిన ధీర మహిళ. మహాదేవ భూపాలుడు కాస్తా మోళిగె (కట్టెల) మారయ్య కాగా గంగాదేవి మోళిగె మహాదేవి అయింది. కాయకజీవులై ఇద్దరూ బ్రదుకుసాగిస్తారు. అనుభవమంటపంలో పాల్గొని వచన రచనకు పూనూకొంటారు. కాలం క్రీ.శ.1160. పురాణగ్రంథాల్లో వీరి ప్రశస్తి ఉన్నది. "నా అయ్య ప్రియ ఇమ్మడి ని:కళంక మల్లికార్జున" అన్న మకుటంతో ఈమె రచించిన 70 వచనాలు దొరికాయి. అన్ని వచనాలూ తత్వప్రదానంగా వున్నాయి. భర్తకు సత్యం విలువను నిలువును చూపిస్తూ చెప్పిన పలుకులే వాటిలో ఎక్కువగావున్నాయి. అంతేకాదు! షట్‍స్థల స్వరూపం, క్రియా-జ్ఞాన సంబంధం, ఇష్టలింగ ప్రాణలింగాల మహాత్వాన్ని తెలిపే ఈమె మిగిలిన వచన కారులికన్నా భిన్నంగా వుంటుంది.
కాణీ కోసం పొరాడి కనకనాన్ని పొగొట్టుకోవడం ఎందుకు?
తొణకుతూ నిండిన బిందెను ఎత్తి పడేయడం ఎందుకు?
నీ అంగాన గురువిచ్చిన లింగమనే దొకటి గుర్తుగా ఉన్నప్పుడు
ఆ నిజలింగ సంగాన్ని ఎరుగక
సందుగొందుల్లోకి దూరుతాననే గొందలమెందుకు
తానున్నచోట పొయిన నగను మరోచోట, భ్రాంతితో వెతికితే
అది తిరిగి తనకు దక్కుతుందా
ఘనలింగం నీ అంగంలో ఉన్నట్టుగా, చూశాను, చూడలేననే
నీ నిజాన్ని నీ ఉన్న తావునే సందేహాన్ని తీర్చుకో
నా ప్రియ ఇమ్మడి నిష్కళంక మల్లికార్జునునిలో /1335
పలికిన ప్రతిమాట మహా ప్రసంగం అయిన తరువాత
లెక్కలేనన్ని వేదాలు, అసంఖ్యాత శాస్త్రాలు
అద్యంత మధ్యాలు లేని పురాణాలను చదువడం ఎందుకు?
కత్తి దూయడం తెలిసిన వాడికి శస్త్ర భయం ఎందుకు?
అలుగు కవచం గలవాడికి బాణంవల్ల గాయం బెదురు ఎందుకు?
శబ్దం ముగ్ధమైన వానికి ఇచ్ఛ తెలిపి కుచిత్తుడు కావడం ఎందుకు?
అది తన మూలంగానే అవును-కాదు అనడానికి ఋజువుగా అయింది
వెలుగు ముఖం నుండి వెలుగు కళను తెలుసుకున్నట్టు
నీనుండి నీవే తెలుసుకో
నా అయ్య ప్రియ ఇమ్మడి నిష్కళంక మల్లికార్జునుని
గురిందిన మరో భావంలేకనే /1339
[1]
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*