మకుటం |
గూడు గుమ్మటేశ్వర ఒడెయ అగమ్మేశ్వర లింగ |
అమృతం గుటకేయక మరచి
అంబలి కాశపడువానిలా
శంబరవైరి తనలో ఉండి
కుజాతీమయుని వెంట పోవువానికి
గుమ్మటనాథుని అగమ్యేశ్వర లింగం లేదంటిని /1920
[1]
మనుముని గుమ్మట దేవుడు: ఇతడు తొలినాళ్ళల్లో జైనుడుగా వుండి పిమ్మట శరణ ధర్మావలంభియైనట్లు తెలుస్తోంది. కాలం క్రీ.శ. 1160. "గూడు గుమ్మటేశ్వర ఒడెయ అగమ్మేశ్వర లింగ" అంకితముద్రతో 99 వచనాలు లభ్యమయ్యాయి. వీటిని పురాతనుల వచనకట్టళ్ళలో ఆత్మ ఎరుక భావస్థలం, ఆత్మ ఐక్యునిస్థలం పిండజ్ఞాన సంబంధం అనే స్థలాల విభజనక్రింద కలిపి వుంచారు. షట్స్థలతత్వం, ఏకదేవోపాసన, పరమతదూషణ, జీవదయాభావం, వీటిలో విశేషంగా నిరూపితమయినాయి. వెడుగు మార్మిక పరిభాషవున్నా కొన్ని వచనాలు మనొజ్ఞంగా వున్నాయి.
ఉత్పత్తి గురువులో, స్థితి లింగంలో
లయం జంగమంలో
మూటిని తెలిసి మీరిన ఘనకూటం వస్తువులో
ఇది చేరువైనది గూటిలోని దానినెరిగి కలుసుకో
గుమ్మటనాథుని అగమ్యేశ్వర లింగమును. /1921 [1]
కాయ సూతకం మాసి జీవుని భవము తొలగి
జ్ఞాన గురువు ఇచ్చిన భావ లింగం ఉండగా
మరి దేనినో చూచుటెందుకు?
పతి ఉన్న సతి దరికి మరొకడు వస్తే బాగుంటుందా?
దానివలే మీకయినది
లింగం ఉన్నట్లు జీవుల అంగమును చూచి
బ్రతికితమను భడవల కెందుకు?
గుడి గుమ్మటనాథుని అగమ్యేశ్వర లింగం
వారి నెఱిగినవాడు కనుక, ఒల్లడు /1922 [1]
దారి చఊపిన వారందరూ
భయానికి నిర్భయలు కాగలరా?
వేదశాస్త్ర పురాణాగమములను చెప్పు వారందరూ
శోధించి గలరా నిజతత్త్వమును?
పిరికివాని శృంగారం, సూర్యుని తీక్షణత అందం
తెలియని వాని సంగం
ఈ రీతి వీరి సందేహం తీర్చు
గుడి గుమ్మటనాథుని యజమాని అగమ్యేశ్వర లింగంలో
ఎడబాయక జతగూడుము. /1925
[1]
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*