కరస్థల మల్లికార్జున దేవుడు
|
|
మకుటం |
పరమగురు శాంతేశ
|
కాయకం:
|
కరస్థలం పరంపరల శాంతేశ గురు
|
*
అంతరంగంలో ఎరుక లేనప్పుడు
బహిరంగ క్రియవలన ఫలమేమి?
అది గ్రుడ్డివాని బ్రదుకు లాంటిది
బహిరంగంలో క్రియ లేనివాడికి
అంతరంగంలో ఎరుక కల్గి ఫలమేమి?
అది అడవిగాచిన వెన్నెల లాంటిది
అంతరంగంలో ఎరుకా, బహిరంగంలో క్రియ
ఈ ఉభయాంగాలు ఒక్కటై వుండాలి
అదేమంటే
“అంతర్జాన బహిః క్రియా ఏకీభావో విశేషతః”
అనుట వలన
అంతరంగంలో ఎరుక, బహిరంగంలో క్రియగల మహాత్ముడే
భక్తుడు, మహేశ్వరుడు, ప్రసాది, ప్రాణలింగం, శరణుడూ
ఐక్యుడూ కాగలడు
మన పరమగురుడు శాంతమల్లికార్జునుడు తానే కాగలడు. /2235[1]
కరస్థల మల్లికార్జున దేవుడు: బ్రహ్మాద్వైత సిద్ధాంత షట్స్థాలాభరణ మనే కృతి సంకలనం చేసిన ఇతని జీవన సంగులేమి తెలియవు. కరస్థలం పరంపరల శాంతేశ గురు. కాలం క్రి.శ.1409-1447. "పరమగురు శాంతేశ" అంకితంతో నాల్గు వచనాలు దొరికాయి. వీటిలో ఇష్టలింగంపై నిష్ఠలేని వారి విమర్శ, సంసారంలో మైమరచినవారి నీతి, అంతరంగంలో తెలివిలేని బహిరంగ క్రియావంతుల విమర్శా పరమశివయోగి స్వరూప వర్ణనలూ చేయడం జరిగింది.
వారధిలోని వడగళ్ళు చీల్చి
దూలాలూ స్థంభాలుగా పేర్చి ఇల్లు కట్టుకొని
కాపుండగలమా అయ్యా?
అగ్నిలో పడిన కర్పూరము భరిణను చేసి
పరిమళము నింపి, పూసికొని
సుఖించగలమా అయ్యా?
వాయువు నందలి పరిమళమును బట్టి
మాలలల్లుకొని శిగలోపల
ముడువనౌనా అయ్యా?
దవ్వుల మొండమావుల నీరు కడవలో నింపి
మోసికొనివచ్చి వంటజేసికొని
తినగలమా అయ్యా ?
మీ నెలవు నెరిగి చేరి పరవశుడై
తన్ను మరచిన పరశివయోగికి
తిరిగి పరిభవాలుంటాయా?
పరమగురు శాంత మల్లికార్జునా /2236 [1]
సతులను చూచి సంతోషిస్తూ
సుతులను చూచి సమ్మోదిస్తూ
అతి తెలివిచేత మైమరచిపోయి
సతి సుతులనే సంసారంలో
మతిచెడి మూర్ఖులైన వారినేమంటాను?
నా పరమగురు శాంత మల్లికార్జునా. /2237 [1]
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*