Previous బత్తలేశ్వరుని పుణ్యస్త్రీ గుడ్డవ్వ బాలసంగయ్యా Next

బహురూపి చౌడయ్య

మకుటం రేకణ్ణ ప్రియ నాగినాథ
కాయకం: జానపద కళాకారుడు

నోటిలోనున్న రుచిని ఊమ్మివేసి మింగనౌనా?
కంటోనున్న రూపాన్ని ఎడంచేసి చూడగలమా?
చేతిలోని వస్తువును వదిలి పట్టుకోగలమా?
తనలోని ఘనాన్ని భిన్నంగా పెట్టి చూస్తారా?
రేకణ్ణ ప్రియ నాగినాథా
బసవుని వల్ల బ్రతికాయి ఈ లోకాలన్ని - బహూరూపి చౌడయ్య/1841 [1]

బహురూపి చౌడయ్య: జానపద కళాకారుడైన ఇతని పుట్టిన ఊరు రేకళిగె. (మహబూబ్‍నగర జిల్లా, తెలంగాణ) కల్యాణ నగరానికి వచ్చి బహురూపి (పగటి వేషగాడు) కాయకంతో శరణజీవితాన్ని గడుపుతుంటాడు. కావ్య పురాణాల్లోనూ, జానపద పాటల్లోనూ ఇతని కథ ప్రసిద్ధంగా వుంది. "రేకణ్ణ ప్రియ నాగినాథ" అంకితముద్రతో 66 వచనాలు దొరికాయి. అవి ఎక్కువ పగటి వేషగాళ్ళ పదజాలంతో తత్తబోధ చేస్తాయి. కొన్ని వెడగు (మార్మిక) వచనాలూ వున్నాయి.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous బత్తలేశ్వరుని పుణ్యస్త్రీ గుడ్డవ్వ బాలసంగయ్యా Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys