Previous జగళగంటి (జగడాల) కామయ్య పశువుల కాపరి రామన్న Next

తలారి కామిదేవయ్య

మకుటం కామహర ప్రియరామనాథ
కాయకం: తలారి వృత్తి

ఎద్దుగా ఉండి భుజం ఇవ్వనంటే సరియా?
తొత్తుగా ఉండి చెప్పింది విననంటే మెచ్చుకుంటారా?
భక్తుడిగా ఉండి గురువులనాదరించకపోతె అది వ్యర్థమంటాను
కామహరప్రియ రామనాథా! /1788 [1]

తలారి కామిదేవయ్య: కల్యాణ నగరంలో తలారి వృత్తిలో వున్నవాడు. కాలం క్రి.శ.1160 "కామహర ప్రియరామనాథ" అంకితంతో వున్న ఇతని పది వచనాలు దొరికాయి. స్వీయూ ధ్యాత్మికానుభవాల్ని సరళమైన మృదువైన పదాలతో వివరించాడు.

వ్యవహారం చేస్తూ లాభం గడించకపోతే
ఆ వ్యవహారమెందుకు?
గురులింగజంగములకు ఖ్యాతికై చేస్తే
పెట్టుబడి తప్పి లాభాన్ని కోరినట్టు
కామహరప్రియ రామనాథా! / 1789 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous జగళగంటి (జగడాల) కామయ్య పశువుల కాపరి రామన్న Next