Previous గజేశ మసణయ్యగారి పుణ్యస్త్రీ మసణమ్మ గుండయ్యగారి పుణ్యస్త్రీ కేతలదేవి Next

గొగ్గవ్వె

మకుటం నాస్తినాథా
కాయకం: విరాగిని

మగవాడు మొహించి స్త్రీని పట్టుకున్నప్పడు
ఆమె ఒకని సొమ్ము అని తెలుసుకోవాలి
స్త్రీ మొహించి పురుషుని పట్టుకున్నప్పడు
ఉత్తరమేమిటనుకోవాలి?
ఈ రెంటి యందలి ఉభయత్వాన్ని
చెరపి సుఖి తానవగలిగినప్పుడు
నాస్తినాథుడు పరిపూర్ణుడని అంటాను - గొగ్గవె /1311 [1]

గొగ్గవ్వె: ఈమె కేరళలోని అవలూరకు చెందినది. కాలం క్రి.శ.1160 ధూపం కాయకం చేస్తూండడవల్ల ధూపం గొగ్గవ్వె అనికూడ ప్రసిద్ధురాలు. శివమొహితయైన ఈమె లౌకిక వివాహాన్ని తిరస్కరించి విరాగినియై కల్యాణానికి వచ్చింది. నాస్తినాథా అన్న అంకిత ముద్ర గల 6 వచనాలను రచించింది. వీటిలో లింగాంగ సామరస్యం, స్త్రీ పురుషలు సమానతలను గురించిన చింతనలకూ ఆద్యత ఇవ్వబడింది. సరళమైన శైలి, వృత్తి పరిభాషా పదజాలాలు నిండి ఈమె వచనాలు ఆద్యంతం రక్తకట్టిస్తాయి.

చన్నులు పొంగివస్తే ఆడదంటారు
మీసం మొలిచివస్తే మగ అంటారు
ఈ ఉభయాల జ్ఞానం
ఆడా? మగా? నాస్తి నాథా! - గొగ్గవె /1312

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous గజేశ మసణయ్యగారి పుణ్యస్త్రీ మసణమ్మ గుండయ్యగారి పుణ్యస్త్రీ కేతలదేవి Next