Previous బళ్ళేశమల్లయ్య బాహూర బొమ్మణ్ణ Next

బాలబొమ్మన్న

మకుటం వీరశూర రామేశ్వర

పాము బిలంలో కర్ర ఉంచినంతనే
కర్ర వెంటే పాముపైకి వచ్చినట్లు పరవస్తువు
ఇది నెలిసిన వెంటనే నిజవస్తువు యొక్క గుణమొహంలో అచ్చొత్తినట్లు
రెండు మాసిపోవాలి, వీరశూర రామేశ్వర లింగంలో. /1849 [1]

బాలబొమ్మన్న: భైరవేశ్వర కావ్య కథామణిసూత్ర రత్నాకరంలో ఈతని గురించి ఇలా చెప్పబడింది. సిద్ధరామయసొన్నలాపురంలో దేవాలయం కట్టించి, లింగపూజన నెరవేర్చేవాడు. అప్పడు బాలబొమ్మయ్య తన వద్ద లింగప్రతిష్ట చేయడానికి సొమ్ములేదని చింతలపాలయ్యాడు. సిద్ధరామయ్యగారు అతనిని చేరబిలిచి, పలుగు పార తీసిచ్చి ముంగట్లో త్రవ్వమని ఆదేశించాడు. అలా త్రవివినపుడు బంగారు నిండిన ఒక నిధి లభించింది. వాటితో ఆలయం కట్టించాడు. లింగం ప్రతిష్టంచి పూజలుచేస్తూ బొమ్మన్న సుఖంగా ఉన్నాడు. ఈ గాథను సమర్థస్తూ ఈతని వచనాల్లో ఉదాహరణలున్నాయి. కాలం క్రీ.శ. 1160 "వీరశూర రామేశ్వర" మకుటం దొరికినవి 11 వచనాలు. శరణ స్థుతి, లింగనిష్ఠ, తత్వ బోధ వీనిలో వ్యక్తమయ్యాయి.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous బళ్ళేశమల్లయ్య బాహూర బొమ్మణ్ణ Next