Previous కదిర రెమ్మవ్వ కంబద (కంబాల) మారితందె(తండ్రి) Next

కల కేతయ్య

మకుటం మేఖలేశ్వరలింగ
కాయకం: జానపద కళాకారుడు. తోలుబొమ్మలాట అనే కళాప్రదర్శనలో నిష్ణాతుడితడు.

వేడుకోవడమెందకు కాయకం చేశానని
ఇవ్వకపోతే కలబడి తిట్టడమెందుకు
జంగములకు, భక్తులకు చేశానని
పొలిమేరల్లో, మందిరం, ముందర సందుల్లో
నిలబడి ఎదురు చూడడమెందకు?
ఈ గుణాన్ని కాయకం అంటారా?
ఈ గుణం కడుపుకు దొరకని సమసార స్థితి స్వరూపం
ఉభయ భ్రష్టునికి ఇచ్చిన ద్రవ్యం
మేఖలేశ్వర లింగానికి అందకనే పోయింది /1620 [1]

కల కేతయ్య: "కల కేతుడంటి తండ్రి చూడుమా నాకు" అని బసవన్న గారిచే పేర్కొనబడ్డ ఈతడొక జానపద కళాకారుడు. తోలుబొమ్మలాట అనే కళాప్రదర్శనలో నిష్ణాతుడితడు. అదే ఆయన కాయకం. హరిహరుడు పాల్కురికి సోమనాథడు, భీమకవి, లక్కణ్ణ దండేశుల కావ్యాలు ఈతని కథను తెలుపుతాయి. కాలం క్రి.శ.1160, "మేఖలేశ్వరలింగ" అనే అంకితంతో 11 వచనాలు లభించాయి. తత్వం, వ్యంగ్యం, అనుభావం వీటిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous కదిర రెమ్మవ్వ కంబద (కంబాల) మారితందె(తండ్రి) Next