Previous శంకరదాసిమయ్య సగరద బొమ్మణ్ణ Next

సకలేశ మాదిరాజు

మకుటం సకలేశ్వరదేవ
కాయకం: రాజు, తరువాత శరణుడు

అశన వ్యసనపరు లనంతానంతాలు
కాషాయాంబర ధారులనంతానంతాలు
సకలేశ్వర దేవా
నీవు తప్ప ఇతరము నెరుగని వారు ఎక్కడో ఒక్కరు. /2057 [1]

సకలేశ మాదిరాజు: బసవన్నగారికి వయొధికుడైన సమకాలికుడీతడు. కల్లుకురికె (కల్వకుర్తి) రాజు. తండ్రి మల్లికార్జునుడు. తరువాతి వారైన పద్మరసు, కుమార పద్మరసు, పద్మణాంకులు ఈయన వంశానికి చేరిన భక్త కవులు. మాదిరాజు వైరాగ్యవంతుడై కల్యాణం చేరుకొని శరణుడైనాడు. కాలం క్రీ.శ. 1160. కల్యాణక్రాంతి తరువాత శ్రీ శైలం చేరి అక్కడే ఐక్యం చెందాడు.

జంజాటం వద్దని అడవులకు పోవడంలో
ప్రయోజనం లేదు అదో మూర్ఖత్వం
ఊళ్ళో ఉంటే నరుల హంగు
అడవుల నుంటే తరువుల హంగు
లభించిన పదార్థాన్ని లింగార్పితము చేసి స్వీకరించే
శరణుడే జాణ, సకలేశ్వర దేవా. /2058 [1]

ఆశలున్న వారికన్న అల్పులు లేరు
ఆశారహితల కన్న అధికులు లేరు
దయకల్గి వుండటం కన్న ధర్మం లేదు
ఆలోచనల కన్న సహాయకులు లేరు
సచరాచర లోకానికి సకలేశ్వరున్ని వదలి, దైవం లేదు. /2059[1]

మాదరసు శ్రేష్ఠ సంగీత వేత్త వీణాది అనేక వాద్యాలను పలికించడంలో నిష్ణాతుడనిపించుకొన్నాడు. ’సకలేశ్వరదేవ" అనే అంకితముద్రతో ఇతని 133 వచనాలు దొరుకుతున్నాయి. ఆత్మనిరీక్షణ, భక్తి తీవ్రత, ప్రసాద మహాత్మ్యం, నీతిబోధ, సమాజవిమర్శ వీటిలో లేచి కనిపిస్తున్నాయి. అనేక వచనాల్లో వైయుక్తిక జీవితాంశాలు, సంగీత సంబంధమైన ప్రకటనలు, ఇందులో చొప్పించి వున్నందువల్ల వీటికి చారిత్రక మహత్వం లభించింది.

చెరువును కట్టవచ్చు గానీ నీరు నింపగలమా?
కత్తి నీయవచ్చు గానీ మొనగాని తనమీవచ్చునా?
పెళ్ళి చేయవచ్చు గానీ మగతనం కూర్చవచ్చునా?
ఘనమును చూపగలమే గానీ తలపుల్లో నిలుపగలమా?
చదువు ఒకవంతు బుద్ధి మూడు వంతులు
అనే లోకంలోని సామెతలాగా
సద్గురు కారుణ్యమునైనా సాధించిన వాడులేడు సకలేశ్వరా. /2063[1]

కర్త యొకడే దేవుడు, సత్యమే మంచిమాట
భృత్యాచారమే ఆచారమయ్యా
మరో దేవుడు లేడు, మరో ఆచారము లేదు
మరో మంచిమాట లేదు
మహంతు సకలేశ్వర దేవుని మెప్పించిన పురాతనుల దారియిది
సందేహాలన్ని మాని నమ్మవలసినది. /2064 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous శంకరదాసిమయ్య సగరద బొమ్మణ్ణ Next