| మకుటం | 
                    
                        ఏలేశ్వర లింగ
                     | 
                
                
                    | 
                        కాయకం:
                     | 
                    
                        వ్యవసాయం
                     | 
                
            
        
        *
        
            ఏ వ్రతం నేమం పట్టినా
            
            ఆ వ్రతనేమభావం శుద్ధంగా వుండాలి
            కత్తి, కృషి, యాచక, వాణిజ్యత్వాల ద్వారా వచ్చిన ద్రవ్యాల్లో
            బాహ్యంలో వాడకం - అంతరంగంలో క్రమం
            ఉభయాల్లో శుద్ధుడై వున్న భక్తుని అంగమే ఏలేశ్వరలింగపు అంగం! /1602
            [1]
            
            ఏలేశ్వర కేతయ్య: ఇతడు నేటి గుల్బర్గా జిల్లాలోని ఏలేరి గ్రామానికి చెందినవాడు. భార్య సాయిదేవమ్మ కాలం క్రి.శ.1160. వ్యవసాయం కాయకం. "ఆచారము తనువున కాశ్రయం ఎరుక మనసునకాశ్రయం" అనే నీతితో బ్రదికినవాడు. "ఏలేశ్వర లింగ" అంకితముద్రతో వచనాలు లభించాయి. అన్నీ కూడ చాలావరకు వ్రత-నియమ-శీల-ఆచారాల మహత్తును తెలుపుతుండేవిగా వున్నాయి.
            
            
            తండ్రిని కొడుకు, పిలిచి, కొడుకును తండ్రి పిలిచి
            బావ మరిదిని పిలిచి, మరిది బావను పిలిచి
            ఇలా తమ బంధువులను జంగములని కలుసుకుని భుజించే
            నిస్సిగ్గుల నియమం సుసాంగత్యం కాదు, ఏలేశ్వర లింగానికి! /1606 [1]
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *